పేద కుటుంబాలకు జీవిత బీమా భరోసా

27-11-2026 | 01:25pm

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలం(Ashwapuram Mandal) రామచంద్రపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం(Indiramma Jeevitha Bima scheme), స్మార్ట్ రేషన్ కార్డుల(Smart Ration Cards) పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ భూరెడ్డి స్వాతి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించి, కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆర్థిక భరోసా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులకు రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు భద్రత, ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోడియం మల్లేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి తౌఫిక్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు