విద్యుత్ భద్రతా తనిఖీ లో సింగరేణి అధికారులు....
హై వోల్టేజీ పనుల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి.....కె. మహేశ్వర్ రెడ్డి
కొత్తగూడెం అక్టోబర్ 15 విజయ క్రాంతి :కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని 132 కేవీ సబ్స్టేషన్ను(132 KV Substation) , గురువారము డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ ఎలక్ట్రికల్ కె. మహేశ్వర్ రెడ్డి(Director of Mine Safety (Electrical) – K. Maheshwar Reddy) సందర్శించి, విద్యుత్ భద్రతా ప్రమాణాల అమలుపై తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, హై వోల్టేజీ వద్ద పనిచేసే సమయంలో ,తగిన రక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు షట్డౌన్ విధానాన్ని కచ్చితంగా పాటించాలని, సరైన ఐసోలేషన్, ఎర్తింగ్, అనుమతి పత్రాల ప్రక్రియలను అనుసరించిన తర్వాతే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
అదే విధముగా, ఎత్తైన ప్రదేశాల్లో పనిచేసేటప్పుడు నాణ్యమైన సేఫ్టీ బెల్ట్ లేదా ఫుల్ బాడీ హార్నెస్ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. విద్యుత్ పనుల సమయంలో రక్షణాత్మక హ్యాండ్ గ్లోవ్స్, ఎలక్ట్రికల్ ఇన్సులేటింగ్ షూస్, తగిన ఆర్క్ ఫ్లాష్ ప్రొటెక్షన్ కిట్ వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను (PPE) వినియోగించాలని తెలిపారు.
సబ్స్టేషన్లో పనిచేసే ప్రతి ఉద్యోగి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, భద్రతా ప్రమాణాల్లో ప్రథమ శ్రేణిలో నిలపాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ (ఎలక్ట్రికల్) కె. మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భద్రతా తనిఖీ లో డిడిఎంఎస్ , షేక్ నాగుల్ మీరా, డిడిఎంఎస్ దేవ్ కిషన్ శర్మ, జనరల్ మేనేజర్ (ఈ&ఎం) సెంట్రల్ వర్క్ షాప్ కె. రామ్మోహన్,
జనరల్ మేనేజర్(ఈ&ఎం) వర్క్ షాప్ & ఎనర్జీ మేనేజ్మెంట్ వై. విజయ శేఖర్ బాబు, సబ్స్టేషన్ డిజిఎం కె. వేలాద్రి, ఎస్ఈ(ఈ&ఎం) వి. నరేంద్ర కుమార్, డివైఎస్ఈ ఎం.డి. ఫరూక్, జేఈ(ఈ&ఎం) కోట శ్రీనివాసరావు, సూపర్వైజర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.