పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం
బెజ్జూర్ అక్టోబర్ 16 (విజయక్రాంతి ) : బెజ్జూర్ మండలంలో(Bejjur Mandal) మానవ అక్రమ రవాణా(Human Trafficking), బాలలపై లైంగిక వేధింపులు(Sexual harassment), పోక్సో చట్టం(POCSO Act) తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాథోడ్ బిక్కులాల్(SI Rathod Bikkulal), స్నిగ్ధ సపోర్ట్ పర్సన్, సరిథా సపోర్ట్ పర్సన్, దినేష్ పీసీతో పాటు భరోసా బృందం సభ్యులు పాల్గొని మానవ అక్రమ రవాణా నివారణ, బాలల రక్షణ, లైంగిక వేధింపుల నుంచి పిల్లలను కాపాడటం, బాధితులకు అందుబాటులో ఉన్న సహాయ సేవలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు 1930 నంబర్కు, అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు డయల్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో బెజ్జూర్ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య, కానిస్టేబుళ్లు మహేందర్, సంజీవ్ పాల్గొన్నారు. బాలల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనుమానాస్పద ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా సూచించారు.