దళిత జర్నలిస్టులపై దాడి

16-10-2026 | 06:10pm
  1. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి.
  2. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్ కుమార్.

కోనరావుపేట అక్టోబర్ 16 (విజయక్రాంతి):గంభీరావుపేట మండలంలో దళిత జర్నలిస్టులపై దాడికి పాల్పడిన ఎస్సై శ్రీకాంత్‌ను( SI Srikanth) వెంటనే సస్పెండ్ చేయాలని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్ కుమార్(Bhim Army District President Dobbala Praveen Kumar) డిమాండ్ చేశారు. బాధిత జర్నలిస్టుల ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా దొబ్బల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా ప్రతినిధులపై, ముఖ్యంగా దళిత జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం భావప్రకటనా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.

జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు చట్టానికి లోబడి విధులు నిర్వహించాలే తప్ప, అధికారాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. బాధిత జర్నలిస్టులకు న్యాయం చేయడంతో పాటు తగిన రక్షణ కల్పించాలని కోరారు.

ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్సై శ్రీకాంత్‌ను సస్పెండ్ చేయాలని, బాధితుల ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రేపటి నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.బాధిత జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాసం సుమన్, ఎరవెల్లి విజయ్, శ్రీకాంత్, సంజీవ్, బాలరాజు, మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు