తుడుం దెబ్బ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

14-10-2026 | 04:50pm

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) ఇల్లెందు పట్టణంలోని పెన్షనర్ భవనంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రొఫెసర్లు ఈసం సారయ్య దొర, గట్టి ఎల్లయ్య పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఈసం నరసింహారావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆగబోయిన రవి, ప్రధాన కార్యదర్శిగా జార్కే పాండురంగ, కార్యదర్శిగా ఎం. బుచ్చి రాములు ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షులుగా పెందుర్ జలపతి, జారే కృష్ణ ఎంపికయ్యారు. జాతీయ అధ్యక్షుడిగా గోగ్గల కోటయ్య, ప్రధాన కార్యదర్శిగా మెస్రం మోతిరామ్‌ను ఎన్నుకున్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని 29 శాఖల ఉద్యోగాలను ఆదివాసీలతో భర్తీ చేయాలని, జీవో నంబర్‌ 3 స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని కమిటీ తీర్మానించింది. పేసా, 1/70 చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని, పోడు భూములకు రెవెన్యూ ద్వారా పూర్తి హక్కులతో పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు వారి హక్కుల సాధనకు నిరంతరం పోరాడాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు