పింఛన్లకు గుడ్‌న్యూస్.. కీలక మార్పులు!

14-10-2026 | 06:02pm

న్యూఢిల్లీ: దివ్యాంగులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (National Social Assistance Programme) కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం(Union Cabinet Decisions) తెలిపింది. 2026–27 నుంచి 2030–31 వరకు మరో ఐదేళ్లపాటు ఈ పథకాన్ని కొనసాగించనున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 3.20 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.

పింఛన్ అర్హత 40 శాతానికి తగ్గింపు

దివ్యాంగుల పింఛన్‌(Disability Pension)కు ఇప్పటివరకు ఉన్న 80 శాతం వైకల్యం అర్హత(Disability Eligibility) ప్రమాణాన్ని 40 శాతానికి తగ్గించారు. కనీస వయోపరిమితిని కూడా తొలగించడంతో పుట్టుక నుంచే అర్హత కలిగిన దివ్యాంగులు ఈ పథకం పరిధిలోకి వచ్చే అవకాశం ఏర్పడింది.

పింఛన్ మొత్తంలోనూ మార్పులు

కొత్త నిబంధనల ప్రకారం 79 ఏళ్ల వరకు ఉన్న లబ్ధిదారులకు నెలకు రూ.375, 80 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.625 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ మార్పులకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిన మూడు నెలల్లో అమలు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఐదేళ్లకు రూ.53,428 కోట్ల కేటాయింపు

జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కొనసాగింపునకు ఐదేళ్ల కాలానికి రూ.53,428 కోట్లు కేటాయించారు. వృద్ధులు, వితంతువుల పింఛన్ పథకాలతో పాటు కుటుంబ ప్రయోజన పథకాలు కూడా కొనసాగనున్నాయి. ఈ నిర్ణయంతో సామాజిక భద్రతా పథకాల పరిధిని మరింత విస్తరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వార్తలు