ప్రభుత్వ వైద్యంపై కలెక్టర్‌ విశ్వాసం

14-10-2026 | 06:00pm

జిల్లా ప్రధాన వైద్యశాలలోనే చికిత్స

ప్రజలకు ఆదర్శంగా రాహుల్‌ శర్మ

భూపాలపల్లి (విజయక్రాంతి): వాకింగ్‌ చేస్తుండగా కాలు జారి ఫ్రాక్చర్‌ అయిన జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ(Collector Rahul Sharma) బుధవారం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఎక్స్‌రే పరీక్షలు చేయించుకున్నారు. గాయం అయిన సమయంలో కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలోనే ప్రాథమిక చికిత్స పొందడం ద్వారా ప్రభుత్వ వైద్యంపై తనకున్న నమ్మకాన్ని చాటారు. చికిత్స అనంతరం కోలుకుంటున్న తీరును పరిశీలించేందుకు వైద్యులు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాహుల్ శర్మ సూచించారు.

మరిన్ని వార్తలు