గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమం
14-10-2026 | 06:01pm
భైంసా( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర సరస్వతి మాత ఆలయం వద్ద గోదావరి పుష్కర ఘాట్ల వద్ద గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవా కార్యక్రమాలను(Swachh Seva Program) నిర్వహించారు. గంగపుత్ర సంఘ(Gangaputra Association) సభ్యుల పుష్కర ఘట్టాల వద్ద ఉన్న తొలగించారు. నీటిలో ఉన్న దుస్తులను చెడిపోయిన వస్తువులను కొబ్బరి పీచులను బయటకు తీసి చెత్త డంపింగ్ లకు తరలించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.