బెజ్జంకి ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీర్చాలి

14-10-2026 | 05:58pm

ఎమ్మెల్యేకు యువజన సమాఖ్య వినతి

బెజ్జంకి, అక్టోబర్ 14: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతూ మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు(MLA Dr. Kavvampalli Satyanarayana) అఖిల భారత యువజన సమాఖ్య మండల సమితి నాయకులు వినతిపత్రం అందజేశారు.

ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసి, మందులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అంతటి రాకేష్, కల్లూరి బాలమల్లు, బోనగిరి స్వామి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు