ఇంటింటికి ఇంకుడు గుంతలను నిర్మించుకోండి

14-10-2026 | 06:07pm

ఎంపీడీవో

బోథ్ అక్టోబర్ 14 (విజయక్రాంతి): ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు సూచించారు. బుధవారం మండలంలోని చింతల బోరి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన కలిగించారు. అంతేగాక గ్రామస్తులను ప్రోత్సహించి మార్కౌట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు గుంతల వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గైక్వాడ్ శ్రీరామ్, ఉప సర్పంచ్ దిగోలే విష్ణు, ఉపాధి హామీ మెట్ఈశ్వర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు