వైష్ణవీ రూపంలో దర్శనమిచ్చిన దుర్గా భవాని
ముకరంపుర, అక్టోబర్ 14(విజయ క్రాంతి): కరీంనగర్ నగునూర్ గ్రామంలో వెలసిన దుర్గా భవానీ దేవి ఆలయంలో(Durga Bhavani Devi Temple) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో(During the Sharannavaratri celebrations) భాగంగా దుర్గ భవానీ దేవి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు.
ఆలయ ప్రాంగణమంతా భవానీ నామస్మరణతో మారుమోగింది. గరుడ వాహనంపై ' అమ్మవారు పసుపు రంగు పట్టు చీరను ధరించి, విశేషంగా వైష్ణవీ దేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దివ్య దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై శోభాయమానంగా కొలువుదీరిన జగన్మాతను దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లా న్యాయమూర్తి దుర్గా భవానీ దేవిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వారికి ఘనస్వాగతం పలికిన నిర్వాహకులు, ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. పూజల అనంతరం వేదపండితులు న్యాయమూర్తికి వేదాశీర్వచనం తో పాటు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.