ఈఈ నాగేశ్వర్ రావు పాడే మోసిన ఎంఎల్ఏ, ఎమ్మెల్సీ...
దామరచర్ల :అక్టోబర్ :6,రామగుండం ఇరిగేషన్ ఈఈ కేతావత్ నాగేశ్వర్ రావు నాయక్(Ramagundam Irrigation EE Nageshwar Rao Naik) అనారోగ్యంతో మృతి చెందిగా ఆయన స్వగ్రామం దామరచర్ల మండలం కేతావత్ తండాలో మంగళవారం దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అంతిమయాత్ర లో ఎంఎల్ఏ బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ లు పాల్గొని పాడే మోసి నాగేశ్వర్ రావు పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఆయన నిజాయితీ గల అధికారి అని, ఇరిగేషన్ శాఖలో పని చేసి మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారని చెప్పారు.వారి కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటామని బరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు కిషన్ నాయక్,నాగేశ్వర్ రావ్, మాలోతు దశరథ్ నాయక్, డాక్టర్ జగేందర్,కేశవ్ నాయక్,గోపి నాయక్, సైదా నాయక్,రమేష్ నాయక్, నానిక్యా నాయక్ సీతారాం నాయక్ మాతృనాయక్ నాని నాయక్ తదితరులు పాల్గొన్నారు.