నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు
ఆసిఫాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ కె.హరిత(Collector K. Haritha) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత భవన కార్యాలయ ఆవరణలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు నెలల ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల బస్సును జెండా ఊపి ప్రారంభించారు.
జైనూర్, సిర్పూర్, లింగాపూర్, తిర్యాణి, కేరమేరి మండలాలకు చెందిన 45 మంది శిక్షణకు ఎంపికయ్యారని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్, సింగరేణి డీజీఎం కిరణ్‌బాయి, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.