కండక్టర్ ప్రవల్లిక మృతితో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

04-11-2026 | 12:09pm

ఇల్లందు డిపో ఎదుట కార్మికుల ధర్నా

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ ప్రవల్లిక మృతి(Conductor Pravallika Death) నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇల్లందు ఆర్టీసీ డిపో(Yellandu RTC Depot) ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రవల్లిక మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ధర్నాలో ఆర్టీసీ కార్మికులు పాల్గొని తమ నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు