మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య
06-10-2026 | 09:29pm
పాల్వంచ, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని మండల పరిధిలోని పాండురంగాపురం తండాలో భూక్య కార్తీక్ 18 సంవత్సరాల యువకుడు సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే భూక్య మోతిలాల్ కుమారుడు ఇంట్లో స్వల్ప వివాదంతో మనస్థాపాన్ని గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని మృతి చెందాడు. మోతిలాల్ ఫిర్యాదు మేరకు పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు తర్యాప్తు చేస్తున్నారు.