కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు

26-09-2026 | 09:51pm

అభివృద్ధి చేతకాకనే రేగా పర్యటనపై అక్కసు

గుండాల, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): మండలంలో అభివృద్ధి చేయటం చేతకాకనే కాంగ్రెస్ పార్టీ రేగా కాంతారావు(Congress Party Rega Kantha Rao) పర్యటనపై విమర్శలకు దిగిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్(BRS Party Mandal President Tellam Bhaskar), నాయకులు గడ్డం వీరన్నలు విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 30 నెలలు గడిచినా మండలానికి చేసింది మాత్రం శూన్యమని వారు దుయ్యబట్టారు. మండలంలో రేగా చేసిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని వారు సవాల్ విసిరారు.

అభివృద్ధి అంటే కట్టిన వాటిని రిబ్బన్లు కట్ చేయటం కాదని, కొత్తగా నిధులు తెచ్చి వాటిని పూర్తిచేసి అప్పుడు ఓపెనింగ్ లు చేస్తే మీరు చేసిన అభివృద్ధి అయితది తప్పా గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే చేసిన పనులను తమగా చెప్పుకునేటప్పుడు అభివృద్ధి కాదని విమర్శించారు. మీరు అభివృద్ధి అని చెప్పుకునేది రైతులకు కరెంటు ఇవ్వకపోవడం, రైతులకు యూరియా దొరకకపోవడం, రైతులకు రుణమాఫీ కాకపోవడం, రైతులకు రైతుబంధు ఇవ్వకపోవడం ఇదేనా మీ హయాంలో చేస్తున్న అభివృద్ధి అని ప్రశ్నించారు.

ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు కానీ ఉన్న కల్యాణ లక్ష్మిని తీసేసారు ఇదేనా మీ అభివృద్ధిని ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో విఫలమైందని వారు అన్నారు. మండలంలో అన్ని రహదారులను అన్ని వాగులపై వంతెనలను మంజూరు చేయించి వాటిని సకాలంలో పూర్తి చేయించిన ఘనత రేగాకు దక్కుతుందని, విమర్శలు చేసేటప్పుడు మనం ఏం అభివృద్ధి చేశాం ఇప్పటికి ఎంత అభివృద్ధి చేశాం అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని వారు సూచించారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, గుండాల మండల నాయకులు మండలాన్ని అభివృద్ధి పథంలో నిలపాలని, మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేసే విధంగా మీరు ముందుకు పోవాలే తప్పా ప్రతిపక్ష నాయకులు పర్యటన చేస్తే ఆరోపణలకు దిగడం సరైనది కాదని హితవు పలికారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా ప్రజలలో ఎండగట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించటంలో పార్టీ శ్రేణులు ఒక్కతాటి పైన నిలుస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి టి. రాము, నిట్ట రాములు, తాటి కృష్ణ, జాడి ప్రభాకర్, కుంజ సుధాకర్, బొమ్మెర్ల శ్రీను, జిమ్మిడి సాంబయ్య, గొల్లపల్లి రమేష్, బొమ్మెర్ల పద్మారావు, బొమ్మెర్ల రవి, గుగులోత్ ఈరు, వాగబోయిన బాటయ్య, ఈసం సుధాకర్, ధనసరి భాస్కర్, గంగాధరి ప్రమోద్, మొక్క ప్రశాంత్, సల్లూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు