ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ఏఐఎస్ఎఫ్ ధ్యేయం
ఆలేరు, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యారంగాన్ని(Public education sector) భ్రష్టుపట్టించే విధానాలపై ఉద్యమిస్తామని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. శనివారం ఆలేరు పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో(Arya Vysya Bhavan) ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా(AISF Yadadri Bhuvanagiri District) 4వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట లక్ష్మణ్ ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, ఫీజులు, స్కాలర్షిప్లు, హాస్టల్ సౌకర్యాలు, నిరుద్యోగం వంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థుల హక్కులు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల సమస్యల పరిష్కారం, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చెడే చంద్రయ్య, చెక్క వెంకటేష్, చౌడబోయిన కనకయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు వి.అభిలాష్, ఉప్పుల శాంతికుమార్, కందుల మధు, మారుపాక లోకేష్, చిప్పలపల్లి నవీన్, జిట్టా గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.