శంకుస్థాపనతో సరీ... పనులు ఎప్పుడు ప్రారంభమయ్యేను మరీ
ప్రజాధనంతో నెలకోసారి గుంతల మరమ్మతులెందుకు?
పొనిశెట్టి వెంకటేశ్వర్లు
పాల్వంచ, (విజయక్రాంతి) : మంత్రులు ఎమ్మెల్యేలు హడావుడిగా శంకుస్థాపనలు(శంకుస్థాపనలు) చేయడం తప్ప, పనులు ప్రారంభం లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. ఫలితంగా వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్ నుంచి శ్రీనివాస కాలనీ వరకు డి ఎం ఎఫ్ టి నిధులు రూ.14 కోట్ల తో రెండు లైన్ల రోడ్డు మంజూర్ అయింది. మూడు నెలల క్రితం మంత్రి పొంగలి శ్రీనివాస్ రెడ్డి(Pongali Srinivas Reddy) శంకుస్థాపనలు హడావుడిగా చేశారు.
టెండర్ పూర్తయి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించకపోవడం పట్ల బీజేపీ జిల్లా నాయకులు పొనిశెట్టి వెంకటేశ్వర్లు(BJP District Leader Ponishetti Venkateswarlu) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణ పనులకు సుమారు ఆరు నెలల క్రితమే ప్రభుత్వం టెండర్లు పిలవగా, ఓ కాంట్రాక్టర్ టెండర్(Contractor Tender) దక్కించుకున్నారని తెలిపారు. మూడు నెలల క్రితం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దమ్మపేట సెంటర్‌లో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ, ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడం విచారకరమన్నారు.
రోడ్డుపై ఏర్పడిన గుంతలతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యపై ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే శాశ్వత రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాల్సిన సమయంలో, గుంతలను పూడ్చేందుకు తాత్కాలిక మరమ్మతులు చేస్తూ ప్రజాధనాన్ని పదేపదే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు.
టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సకాలంలో పనులు ప్రారంభించి ఉంటే, నెలకోసారి గుంతలు పూడ్చే తాత్కాలిక మరమ్మతుల అవసరం ఉండేది కాదన్నారు. ఒకవైపు కోట్లాది రూపాయలతో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై, టెండర్లు పూర్తయి, శంకుస్థాపన జరిగినప్పటికీ పనులు ముందుకు సాగకపోవడానికి కారణాలేమిటో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు, ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించేలా అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో మాలోత్ ప్రశాంత్ నాయక్,మాదారపు లక్ష్మణ్ ,శాంపురి నాగేంద్ర బాబు,ch శ్రీను, కాండ్రతి శ్రీను, భట్టు అశోక్, మురళి, పవన్,అఖిల్,ధనుష్ లు పాల్గొన్నారు