భోగి టీజరొచ్చిందే ఓ లచ్చాగుమ్మడి!

05-10-2026 | 05:20am

చార్మింగ్ స్టార్ శర్వా(Charming Star Sharwa) డిఫరెంట్ ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో(Directed by Sampath Nandi) తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆరట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మిగిలిన షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. 

మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభిస్తూ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. 1960ల ప్రారంభంలో తెలంగాణ సరిహద్దులోని బొగ్గుల గుట్ట అనే ఓ కల్పిత గ్రామ పరిచయం.. పాలేగాళ్లు కమ్మరి గంగను తీసుకెళ్లడం.. గ్రామాన్ని కాపాడేందుకు ఓ ప్రత్యేకమైన భక్తి కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుందని వంటి అంశాలతో ఈ టీజర్ రూపుదిద్దుకుంది.

తన కత్తితో తొమ్మిది మెట్లను కడిగి, శత్రువుల రక్తంతో వాటిని అలంకరిస్తానని గంగ పాత్రలో శర్వా చెప్పే మాటలు ఆ పాత్రలోని ఇంటెన్సిటీని చూపిస్తాయి. అనుపమ పరమేశ్వరన్ కూడా పల్లెటూరి లుక్‌లో కనిపిస్తూ తన పాత్రకు ప్రాధాన్యతను తెలియజేస్తోంది. డింపుల్ హయాతి మరో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కిశోర్ కుమార్ అరోకియా; సంగీతం: భీమ్స్ సిసిరోలియో.

మరిన్ని వార్తలు