పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ గొప్ప వరం

15-09-2026 | 06:11pm

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

దామరచర్ల: మిర్యాలగూడ(Miryalaguda)లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దామరచర్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను(CM Relief Fund Cheques) మంగళవారం  దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ (Congress Party)అధ్యక్షులు కొర్ర నాగు నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగు నాయక్  మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సహాయ నిధి  పేద ప్రజలకు గొప్ప వరమని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎంతో భరోసానిస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడి రామ లింగయ్య యాదవ్, అంజిరెడ్డి రవితేజ, గాలం వెంకన్న యాదవ్, సర్పంచులు బెజ్జం సాయి, సిద్ధు నాయక్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, మంగత నాయక్, రవీందర్ నాయక్, కిరణ్ నాయక్, నాగు నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు మోహన్ నాయక్, కిషన్ నాయక్, వంశీ, తారాసింగ్, వంశీ నాయక్ పెండం వీర బాబు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు