అత్యంత అరుదైన గుండె చికిత్స

14-09-2026 | 05:10am

కరీంనగర్ మెడికవర్‌లో వైద్యుల ఘనత

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): గుండెకు రక్తాన్ని సరఫరా చేసే అత్యంత కీలకమైన రక్తనాళంలో ఏర్పడిన తీవ్రమైన బ్లాకేజీకి కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి (Medicover Hospital) వైద్యులు విజయవంతంగా చికిత్స నిర్వహించారు. అత్యంత క్లిష్టమైన లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ బ్లాకేజీ కేసును సవాల్‌గా తీసుకుని, కార్డియాలజిస్టు డాక్టర్ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా స్టెంట్ అమర్చి పేషెంట్‌కు ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడారు.

ఆదివారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సతీష్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన క్రిష్టోఫర్ స్టాన్లీ బంటు అనే వ్యక్తి తీవ్రమైన గుండె నొప్పితో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. పరీక్షల్లో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే అత్యంత ముఖ్యమైన రక్తనాళమైన లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీలో తీవ్రమైన బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించామని వివరించారు.

అత్యాధునిక కార్డియాక్ చికిత్సా విధానాన్ని ఉపయోగించి బ్లాకేజీ ఉన్న ప్రాంతంలో విజయవంతంగా స్టెంట్ అమర్చామని తెలిపారు. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కేవలం 24 గంటల్లోనే డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో అత్యాధునిక కార్డియాలజీ సేవలు, అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఆధునిక క్యాథ్ల్యాబ్ సదుపాయాలు ఉండడంతో హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా గుండె సంబంధిత అత్యంత క్లిష్టమైన కేసులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్బంగా పేషెంట్ క్రిష్టోఫర్ మాట్లాడుతూ... కరీంనగర్‌లోనే జన్మించానని, ఇక్కడే నాకు మెడికవర్ వైద్యులు పునర్జన్మ ఇచ్చారని సంతోషం వ్యక్తం చూస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి సెంటర్హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో అనెస్థీషియా హెడ్ డాక్టర్ వినయ్, క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ ఉపేందర్రెడ్డి, మార్కెటింగ్ హెడ్ కోట కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు