పసిడి కొనుగోలుదారులకు స్వల్ప ఊరట
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి స్వల్ప ఊరట లభించింది. బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ప్రారంభమైన పసిడి ధరల పతనం (Gold Price) రెండో రోజూ కొనసాగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కొంత దిగివచ్చాయి.
గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ గణాంకాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,790గా నమోదైంది. అదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,42,680గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,07,010 వద్ద కొనసాగుతోంది.విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, ఖమ్మం, కాకినాడ నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.
బంగారం బాటలోనే వెండి ధర కూడా స్వల్పంగా దిగివచ్చింది. కిలో వెండిపై సుమారు రూ.100 తగ్గడంతో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,04,900గా నమోదైంది (Silver Rate).దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,110గా పలుకుతోంది. ముంబై, కోల్‌కతా, కేరళలో హైదరాబాద్‌తో సమానంగా ధరలు ఉండగా.. ఢిల్లీలో మాత్రం కొంత అధికంగా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, అమెరికన్ డాలర్ విలువ, స్థానిక పన్నులు, మార్కెట్ పరిస్థితుల (International Market) ఆధారంగా పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటాయి. ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో ఆరోజు తాజా ధరలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.గమనిక: పైన పేర్కొన్న ధరలు బుధవారం ఉదయం నమోదైన వివరాలు మాత్రమే. వీటికి వస్తు సేవల పన్ను, తయారీ ఛార్జీలు అదనంగా వర్తించవచ్చు.