పసిడి ప్రియులకు పండగే..బంగారం, వెండి డౌన్
15-10-2026 | 10:07am
హైదరాబాద్: బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గి రూ.1,35,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి రూ.1,47,440కు దిగివచ్చింది.
వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గడంతో ధర రూ.2,40,000కు చేరింది. బంగారం, వెండి ధరల తగ్గుదలతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ధరల ధోరణి కొనసాగనుంది. అయితే నగరం, దుకాణాన్ని బట్టి ఆభరణాల తయారీ ఛార్జీలు, పన్నుల కారణంగా తుది ధరల్లో వ్యత్యాసాలు ఉండవచ్చు.