బుల్ జోరు.. గ్రీన్‌లో సెన్సెక్స్, నిఫ్టీ

15-10-2026 | 10:02am

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) 379 పాయింట్లు పెరిగి 73,142 వద్ద కొనసాగుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (Nifty) 108 పాయింట్లు ఎగబాకి 22,719 వద్ద ట్రేడవుతోంది.

మార్కెట్లలో కొనుగోళ్ల మద్దతుతో పలు ప్రముఖ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), టెక్ మహీంద్రా (Tech Mahindra), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), హిందుస్థాన్ యూనిలివర్ (Hindustan Unilever) షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మార్కెట్ కదలికలపై మదుపరులు దృష్టి సారిస్తున్నారు.

మరిన్ని వార్తలు