చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం
తెలంగాణలో ఆందోళనకరం!
శారీరక శ్రమ, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలంటున్న వైద్యులు
హైదరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): ఒకప్పుడు చిన్నారుల్లో పోషకాహారలోపం, తక్కువ బరువు ప్రధాన సమస్యలుగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అధిక బరువు, ఊబకాయం(Obesity) కూడా చిన్నారులను వేధిస్తున్నాయి. తెలంగాణలో చిన్నారుల ఊబకాయం గణనీయంగా పెరిగింది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)-4లో 0.7 శాతంగా ఉన్న చిన్నారుల ఊబకాయం.. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5లో 3.4 శాతానికి చేరింది. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో అధిక బరువు, ఊబకాయం కలిపి 20 నుంచి 35 శాతం వ రకు ఉన్నట్లు వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇళ్లలో సంప్రదాయ ఆహారానికి బదులుగా అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు కలిగిన ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలు, చిప్స్, నూడుల్స్, తీపి పానీయా ల వినియోగం పెరుగుతోంది. ఇవి పిల్లల ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తున్నాయి.
దేశంలో చిన్నారుల ఊబకాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రా ల్లో తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నా యి. పెద్దల్లో అధిక బరువు, ఊబకాయం కూడా ఆందోళన కలిగించే స్థాయిలో ఉంది. ఐసీఎంఆర్‌ఎన్‌ఐఎన్ అధ్యయనం ప్రకారం తెలంగా ణలో 47.7 శాతం మంది పెద్దలు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నా రు. తల్లిదండ్రుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు పిల్లలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.
హైదరాబాద్‌లో చిన్నారుల్లో అధిక బరువు సమస్య పెరుగుతోంది. ప్రైవేటు పా ఠశాలల్లో నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో ఐఏపీ ప్రమాణాల ప్రకారం ఊబకాయం, అధిక బరువు కలిపి గణనీయమైన స్థాయి లో నమోదయ్యాయి. ప్రభుత్వ, సెమీ అర్బన్ పాఠశాలల్లోనూ ఈ సమస్య 19 నుంచి 21 శాతం వరకు ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చిన్నారుల ఊబకాయాన్ని కేవలం ఆహారం తగ్గించడం ద్వారా నియంత్రించలేము.
పిల్లల మానసిక ఆరోగ్యం, స్క్రీ న్ వినియోగం, శారీరక చురుకుదనం, కుటుంబ సభ్యుల జీవనశైలి.. అన్నింటిపైనా దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పడమే కాకుండా తామూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. రోజువారీ శారీరక శ్రమకు సమయం కేటాయించాలి. పాఠశాలల్లోనూ క్రమ బద్ధమైన వ్యాయామం, క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్నారులు రోజులో కనీసం 45 నుంచి 60 నిమిషాలు శారీరకంగా చురుకుగా ఉండేలా పాఠశాలలు చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లోనూ రోజువారీ వ్యాయామం, క్రీడలకు తగిన సమయం కేటాయించాలి.
అలాగే నగరాల్లో పిల్లలు ఆడుకునేందుకు సురక్షితమైన ఆటస్థలాలు, నడక మార్గాలు, సైకిల్ ట్రాక్లను అభివృద్ధి చేయాలి. వేగంగా అభివృద్ధి చెం దుతున్న నివాస ప్రాంతాల్లో ఉన్న బహిరంగ స్థలాలను కాపాడాల్సిన అ వసరం ఉంది. చిన్నారుల ఊబకాయాన్ని ఒక వ్యక్తిగత సమస్యగా కాకుండా.. కుటుం బం, పాఠశాల, స మాజం కలిసి పరిష్కరించాల్సిన ప్రజారోగ్య సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది.
బాబు ఎస్ మదార్కర్
క్లినికల్ డైరెక్టర్, చీఫ్ నియోనాటాజిస్ట్
కిమ్స్ కడల్స్, సికింద్రాబాద్