ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్
హైటెక్ సిటీలో ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): టీకాలు చిన్నారులకు మాత్రమే కాదు.. పెద్దలకు కూడా వయసు, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ముప్పు ఆధారంగా సరైన సమయంలో వ్యాక్సినేషన్ అవసరమని మెడికవర్ హాస్పిటల్స్(Medicover Hospitals) వైద్యులు తెలిపారు. పెద్దల్లో వ్యాక్సినేషన్‌ను అవగాహన పెంచడంతో పాటు, వ్యాక్సిన్‌తో నివారించగల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్(Special Adult Vaccination Clinic)ను ప్రారంభించింది.
చిన్నారులకు టీకాల షెడ్యూల్‌ను తల్లిదండ్రులు క్రమం తప్పకుండా పాటిస్తున్నప్పటికీ, పెద్దల వ్యాక్సినేషన్‌ను మాత్రం చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు తెలిపారు. వయసు పెరిగే కొద్దీ, అలాగే మధుమేహం, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.
కొత్తగా ప్రారం భించిన అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్‌లో వ్యక్తి వయసు, గతంలో తీసుకున్న టీకాలు, ఆరోగ్య పరిస్థితులు, వృత్తి, రోగనిరోధక శక్తి, ఇతర అనారోగ్య ముప్పులను పరిగణనలోకి తీసుకుని వైద్యుల సూచనల మేరకు వ్యాక్సినేషన్ అందించనున్నారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఏఆర్ రఘుకాంత్ మాట్లాడుతూ వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తీవ్రంగా మారే అవకాశం ఉందన్నారు. వ్యాక్సినేషన్ ఇలాంటి ఇ న్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో కీలక పా త్ర పోషిస్తుంది. ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత ఆలోచించడం కంటే ముందుగానే వ్యాధుల నివారణపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమన్నారు.
క్యాన్సర్ నివారణలో వ్యా క్సినేషన్ ప్రాధాన్యతను వివరిస్తూ మెడికవర్ హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, కొన్ని ఇన్ఫెక్షన్లు భవిష్యత్తులో క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉన్నందున వాటి నివారణ కూడా ముఖ్యమన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ సంబంధిత క్యాన్సర్ల ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది. వయసు, ఆరోగ్య పరిస్థితులు, రోగనిరోధక శక్తిని బట్టి ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ అవసరాలు భిన్నంగా ఉంటాయి. అం దువల్ల వైద్యుల సలహా తీసుకుని తగిన వ్యా క్సిన్లు తీసుకోవాలి అని అన్నారు. కాగా పెద్ద ల్లో వ్యాక్సినేన్‌పై అవగాహన పెంచుతూ, వ్యాక్సిన్తో నివారించగల వ్యాధుల నుంచి ప్ర జలను రక్షించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభించిన అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్ కీలకమైన ముందడుగుగా నిలుస్తుందని వైద్యు లు పేర్కొన్నారు.