కాప్రాలో డాక్టర్‌ కీర్తి ఆత్మహత్య

07-09-2026 | 12:27pm

మేడ్చల్ సెప్టెంబర్ 7(విజయ క్రాంతి): కాప్రా: కాప్రాలోని వైష్ణవి ఎన్‌క్లేవ్‌(Vaishnavi Enclave)లో డాక్టర్‌ కీర్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కిచెన్‌(Kitchen)లో ఆమె ఉరేసుకుని కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు