మొయినాబాద్ హాస్టల్లో అగ్నిప్రమాదం

07-09-2026 | 12:22pm

రంగారెడ్డి, సెప్టెంబర్ 7(విజయక్రాంతి):  మొయినాబాద్‌(Moinabad)లోని అజీజ్‌నగర్‌ చౌరస్తా వద్ద ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో సోమవారం తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌(Short circuit)తో మంటలు చెలరేగాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉదయం 5 గంటల సమయంలో విద్యుత్‌ వైర్లు కాలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అదే సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. హాస్టల్‌లో సుమారు 90 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు