శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం.. ఐదుగురు మహిళలు మృతి!

16-10-2026 | 06:03pm

శ్రీసత్యసాయి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గొల్లపల్లి జలాశయంలో మునిగి ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పెనుకొండ దర్గాపేటకు చెందిన గాయత్రి కుటుంబ సభ్యులు, స్నేహితులు జలాశయాన్ని సందర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులు ఇటీవల బెంగళూరు నుంచి వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

జలాశయంలో దిగిన సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సహాయంతో మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మృతుల్లో గాయత్రి, అశ్విని, పుష్ప, హసీనా, మహిన్ ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు