జీపు-లారీ ఢీ.. నలుగురి దుర్మరణం

24-11-2026 | 11:12am

విజయనగరం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) తీవ్ర విషాదాన్ని నింపింది. భోగాపురం మండలం(Bhogapuram Mandal) సుందరపేట సమీపంలోని జాతీయ రహదారిపై జీపు, లారీ ఢీకొన్నాయి(Jeep-Lorry Collision). ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

ప్రమాద తీవ్రతకు వాహనం దెబ్బతిన్నట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు