చిన్న ఎల్లాపూర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ (Cordon Search) నిర్వహించారు. ఈ సందర్భంగా 150 ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. 20 అనుమానాస్పద వాహనాలను (Vehicles), 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. మరో 800 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులకు రోడ్డు భద్రతా (Road Safety) నియమాలు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాల (Cyber Crimes) పట్ల అప్రమత్తంగా ఉండటంపై పోలీసులు అవగాహన కల్పించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలని గూడూరు సీఐ వినయ్ సూచించారు.