చౌకనపల్లి శరణ బంధువుల బసవకళ్యాణ్ పాదయాత్ర

24-11-2026 | 10:43am

కంగ్టి, నవంబర్ 24 (విజయక్రాంతి): బసవన్న బోధించిన సమానత్వం (Equality), భక్తి (Devotion), మానవతా (Humanity) విలువలను చాటుతూ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చౌకనపల్లి గ్రామానికి చెందిన శరణ బంధువులు బసవకళ్యాణ్‌కు పాదయాత్రగా బయలుదేరారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా బసవకళ్యాణ్‌లో నిర్వహించనున్న 47వ అనుభవ మంటప ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం యాత్రను ప్రారంభించారు.

శరణు శరణార్థి నినాదాలతో, బసవన్న తత్వ సందేశాలను స్మరించుకుంటూ భక్తులు ఉత్సాహంగా ముందుకు సాగారు. బసవ తత్వ ప్రచారం (Philosophy), ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడం, శరణుల ఐక్యతను చాటడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ పాదయాత్రలో బాబు పాటిల్, వైజ్యనాథ్ పాటిల్, సంగప్ప పాటిల్, బుక్కసంగప్ప, బాబుదేశాయ్, బాబు చోంచ, మల్లప్ప, మల్లేష్, కుశప్ప దేశముఖ్, హన్మంతు, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు