కందికొండ జాతర ప్రారంభం
24-11-2026 | 10:46am
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కందికొండ జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి సందర్భంగా కందగిరి క్షేత్రంపై కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి జాతర (Fair) నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో కందగిరికి తరలివస్తున్నారు.
ఎత్తైన కొండపై ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ముందుగా కొండ మధ్యలో వెలసిన వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం లక్ష్మీనరసింహస్వామి (Temple) దర్శనానికి చేరుకుంటున్నారు. భక్తుల రాకతో కందికొండ క్షేత్రం ఆధ్యాత్మిక (Spiritual) శోభను సంతరించుకుంది.