కరాటే ఛాంపియన్‌షిప్‌లో సత్తుపల్లి విద్యార్థి ప్రతిభ

24-11-2026 | 10:55am

సత్తుపల్లి, నవంబర్ 24 (విజయక్రాంతి): ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్ (All India Karate Championship) – 2026లో నారాయణ స్కూల్, సత్తుపల్లికి చెందిన విద్యార్థి మట్టా స్వామి గౌడ్ తన ప్రతిభతో పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా ఏజీఎం రాంకీ, ఆర్‌ఐ క్రాంతి విద్యార్థి స్వామి గౌడ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అతని కృషి, పట్టుదల (Dedication), క్రీడల పట్ల ఆసక్తిని ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

పాఠశాల ప్రిన్సిపాల్ రామ్మూర్తి మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో (Sports) రాణించడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం కూడా ఎంతో ఉందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి తగిన ప్రోత్సాహం అందిస్తూ చదువుతో పాటు క్రీడల్లోనూ ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయడమే తమ లక్ష్యమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

మరిన్ని వార్తలు