బైక్ యాక్సిడెంట్ తో వ్యక్తి మృతి
ఎర్రుపాలెం అక్టోబర్ 21 (విజయ క్రాంతి): ఖమ్మం జిల్లా(Khammam district) ఎర్రుపాలెం మండలం కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున బైక్ యాక్సిడెంట్(Bike accident) తో వ్యక్తి మృతి చెందిన ఘటన జరిగింది. తెల్ల పాలెం గ్రామానికి చెందిన వాగదాని వీరబాబు(Vaagadāni Veerababu)(23) కండ్రిక నుండి ఎర్రుపాలెం వెళుతున్న నేపథ్యంలో బైక్ అదుపుతప్పి రోడ్డు తలకు బలంగా తాకటంతో అక్కడికక్కడే మృతి చెందాడు విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎస్సై రమేష్ కుమార్(SI Ramesh Kumar) ఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి డెడ్ బాడీని మధిర ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం తండ్రి వాగదాని శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.