థానేలో భారీ అగ్నిప్రమాదం

15-10-2026 | 05:08pm

థానే: మహారాష్ట్రలోని థానేలో వాణిజ్య గిడ్డంగుల(Commercial warehouses) సముదాయంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం(Fire Accident ) చోటుచేసుకుంది. ఈ ఘటనలో గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన వస్తువులు పెద్దఎత్తున అగ్నికి ఆహుతయ్యాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టంగానీ, ఎవరికి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. దివా-షిల్ రోడ్డులోని ఖర్దీ గ్రామం పరిధిలో ఉన్న అర్షద్ కాంపౌండ్‌(Arshad Compound )లో ఉదయం సుమారు 10.30 గంటలకు మంటలు చెలరేగాయి.

అక్కడి వాణిజ్య గిడ్డంగుల సముదాయంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఆస్తి నష్టం వాటిల్లింది. గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన ఫర్నిచర్, ప్లాస్టిక్ స్క్రాప్‌తో పాటు ఫ్యాబ్రికేషన్‌కు సంబంధించిన సామగ్రి మంటల్లో కాలిపోయినట్లు థానే మున్సిపల్ కార్పొరేషన్(Thane Municipal Corporation) ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం అధిపతి యాసిన్ తడ్వి తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు