గిరిజన రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ
శివంపేట్ అక్టోబర్ 15 (విజయక్రాంతి ): శివ్వంపేట మండలంలోని భీమ్లా తాండ గ్రామపంచాయతీ(Bhimla Thanda Gram Panchayat) పరిధిలోని శంకర్ తండాలో మాలోత్ శంకర్ అనే రైతు తన వరి పొలం ఎండిపోయిందని బెంగపడి మనస్థాపంతో పొలంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని చనిపోవడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరైన విద్యుత్ ను అందించలేక పోవడంతో తాను సాగు చేసిన వరి పంటకు తగిన నీరు సరిపోలేక వరి పంట ఎండిపోయిందని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
మృతి చెందిన శంకర్ కుటుంబాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అనంతరం ఎంపీ మాట్లాడుతూ శంకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అలాగే తన కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి అశోక్ సాదుల, మండల అధ్యక్షులు పెద్దపులి రవి, భీమ్లా తాండ సర్పంచ్ లక్ష్మీ దుర్గ్య నాయక్, ఉప సర్పంచ్ కంస వెంకటేష్ నాయక్, జిల్లా కార్యదర్శి ఎరుకల భిక్షపతి, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, మండల ఉపాధ్యక్షులు గోప్యానాయక్, దుబ్బ శేఖర్, మామిడి నర్సారెడ్డి, జిల్లా ఎస్టి మోర్చా కార్యదర్శి విట్టల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.