ఓవర్‌లోడ్‎తో ఆటో బోల్తా..క్షతగాత్రుల్లో చిన్నారులు

14-10-2026 | 12:17pm

నాగర్‌కర్నూల్‌ (విజయక్రాంతి): పత్తి తీసేందుకు కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్‌ గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా కూలీలు గాయపడినట్లు సమాచారం. ఒకే ఆటోలో 25 మందికి పైగా ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరగడం స్థానికంగా ఆందోళన కలిగించింది. నాగర్‌కర్నూల్‌ మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన కూలీలు తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామంలోని పంట పొలాల్లో పత్తి తీసేందుకు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో ఇంద్రకల్‌ గ్రామ శివారులో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: గంగలో పడవ ప్రమాదం.. 13 మంది చిన్నారులు మృతి

ప్రమాదంలో 20 మందికి పైగా కూలీలు గాయపడినట్లు సమాచారం. వారిలో కొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో పదేళ్లలోపు చిన్నారులు ఇద్దరికి పైగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ (108 Ambulance) సహాయంతో నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు