గంగలో పడవ ప్రమాదం.. 13 మంది చిన్నారులు మృతి

14-10-2026 | 07:41am

బిహార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గంగా నదిలో పడవ బోల్తాపడిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతులంతా 15 ఏళ్లలోపు చిన్నారులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వైశాలి జిల్లాలోని రాంపూర్ శ్యామ్ చంద్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పడవ నదిలో బోల్తాపడటంతో పలువురు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు (Rescue Teams) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు (Rescue Operations) కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు, మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు