శ్రీ మహా చండీ దేవి అవతారంలో ఫ్రెండ్స్ యూత్ అమ్మవారు
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 13 ( విజయక్రాంతి ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక క్రిష్ణకాలని అంబేద్కర్ స్టేడియం(Ambedkar Stadium) ఎదురుగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలు (Sri Kanaka Durga Sharannavaratri Celebrations)బుధవారం 4వ రోజుకు చేరుకున్నాయి. 4వ రోజు అమ్మవారు శ్రీ మహా చండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వగా శ్రీమతి శ్రీ ఎడ్ల దివ్య హరీష్ దంపతులు పూజా కార్యక్రమంలో కూర్చున్నారు.
ఈ సందర్భంగా పురోహితులు కొదురుపాక కృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.