హైజాక్ అలర్ట్
హైజాక్ అలర్ట్తో విమానం దారి మళ్లింపు.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
జైపూర్: ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా(Air India Flight) విమానానికి బుధవారం ఉదయం హైజాక్ హెచ్చరిక రావడంతో కలకలం రేగింది. దీంతో Air India Flight AI2030ను జైపూర్కు మళ్లించారు. బోయింగ్ 787-9 విమానాన్ని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ పరిణామంతో విమాన భద్రతపై అధికారుల్లో అప్రమత్తత నెలకొంది.
విమానం ల్యాండ్ అయిన అనంతరం దానిని సాధారణ పార్కింగ్ ప్రాంతానికి దూరంగా ఉన్న Isolation Bayకు తరలించి భద్రతా తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. హైజాక్ హెచ్చరిక నేపథ్యంలో విమానంలో ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా అనే కోణంలో అధికారులు పరిశీలించారు. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ హైజాక్ అలర్ట్ False Alarmగా తేలింది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ విమానాన్ని దారి మళ్లించి తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనతో Air India Flight Diversion, Jaipur Airport Security, Aircraft Hijack Alert అంశాలు చర్చనీయాంశంగా మారాయి.