గంగపుత్ర జాతిపిత బాలయ్య

11-11-2026 | 05:05am

ఆచార్య సందిరి బాలయ్య(Acharya Sandiri Balayya) తెలంగాణ సామాజిక ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమైన నాయకుడు. రజాకార్ల ఆగడాలు, అణచివేతకు వ్యతిరేకం గా పోరాడిన సామాజిక విప్లవకారుడు. శతాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మత్స్యకార కులాల అభ్యున్నతి కోసం  తన జీవితాన్ని అంకితం చేసిన ధీశాలి.

గంగపుత్రుల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన అసమాన పోరాటానికి గాను సమాజం ఆయనను ‘గంగపుత్ర జాతిపిత’ మరియు ‘మత్స్యకార మహాత్ముడు’ అనే గౌరవంతో కీర్తిస్తోంది. సందిరి బాలయ్య 1911 నవంబర్ 11వ తేదీన కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో రాజమ్మ, బాలయ్య దంపతు లకు జన్మించారు. నాగమ్మను వివాహమాడారు.

జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ చేరుకుని బేగంబజార్‌లో తమలపాకుల వ్యాపారం చేపట్టారు. ఆ రోజుల్లో నిజాం పాలనలో ప్రజలు తీవ్రమైన సామాజిక, ఆర్థిక ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా మత్స్యకార కులాలు ఎదుర్కొంటున్న దుర్భర పరి స్థితులను లోతుగా అధ్యయనం చేశారు. విద్య, ఐక్యత, సంఘటిత శక్తితోనే మార్పు సాధ్యమని విశ్వసించిన బాలయ్య..

గంగపుత్ర సమాజ చైతన్యానికి, హక్కుల సాధనకు అహర్నిశలు శ్రమించారు. పలకాబలపాలతో గ్రామగ్రామాన తిరుగుతూ ప్రజలకు అక్షరజ్ఞా నం ప్రాముఖ్యతను తెలియజేశారు. మత్స్యకార కులాలన్నీ ఐక్యంగా ఉం డాలని, సంఘటిత శక్తిగా ఎదగాలని బోధించారు. బాలయ్య జీవితంలో 1934 సంవత్సరం కీలక మలుపు. మత్స్యకార కులాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని ‘గంగపుత్ర సంఘ్’ స్థాపించారు.

పిట్టెల నాగ య్య, మధునాల లింగయ్య, గుంటి రామయ్య, గుర్రపు బాలకష్ణయ్య, పూస భద్రయ్య, చుక్కల బాలకిష్టయ్య, మెట్టు లక్ష్మయ్య తదితరులు సహకరించారు. సంఘం అధ్యక్షుడిగా బాలయ్య ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. 

సంఘం కార్యకలాపాలను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా 1944లో జిల్లాలు, పట్టణాలు, గ్రామాలకు సైతం విస్తరించారు. ఈ కార్యక్రమాల్లో తోపారపు గంగారాం, గడప భూమయ్య, సందిరి పోచయ్య, సందిరి చిన్నబాలయ్య తదితరులు భాగస్వాములయ్యారు. గంగపుత్రుల సామాజిక, సాంస్కృతిక విషయాలను ప్రజలకు చేరవేయడానికి సంఘం ఆధ్వర్యంలో ‘గంగాజ్యోతి’ అనే మాసపత్రిక నడిపించారు.

అలాగే గంగపుత్రుల చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ‘గ్రంథ పరిశోధక మండలి’ ఏర్పాటు చేశారు.  1953లో శ్రీబొజ్జం నర్సింహులు గారి నాయకత్వంలో సంప్రదాయ మత్స్యకార కులాల సామాజిక స్థితిగతులు, వెను కబాటుతనం, అభ్యున్నతికి  చర్యలు చేపట్టారు. బాలయ్య నాయకత్వ ప్రస్థానంలో 1954 ముఖ్యమైన ఘట్టం.

జూన్ 25, 26, 27 తేదీల్లో హైద రాబాద్‌లోని కాచిగూడ ప్రాంతంలో ఆయన అధ్యక్షతన ‘అఖిల హైదరాబాద్ రాష్ట్ర గంగపుత్ర మహాసభలు’ నిర్వహించబడ్డాయి. నాటి హైదరా బాద్ రాష్ర్టంలోని 16 జిల్లాల నుంచి బెస్త, గూండ్ల తదితర మత్స్యకార వర్గాల ప్రజలు ఈ మహాసభల్లో పాల్గొన్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత గంగపుత్రుల సంఘటిత ఉద్యమాన్ని రాష్ట్రస్థాయిలో కొన సాగించడానికి..

రిజిస్ట్రేషన్ నెంబర్ 51/1956తో గంగపుత్ర సంఘాన్ని నమోదుచేశారు.ఇందులో బాలయ్య సోదరులు సందిరి పోచయ్య, సం దిరి చిన్నబాలయ్య కీలకపాత్ర పోషించారు. బాలయ్య 1967 జనవరి 7న పరమపదించారు. సమా జంలో ఐక్య త, ఆత్మగౌరవం, విద్య, సామాజిక చైతన్యం కోసం జీవితాంతం కృషిచే సిన దార్శనికుడు సందరి బాలయ్య. 

వ్యాసకర్త: మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు (9848303123)


మరిన్ని వార్తలు