సంఘర్షణ కంటె శాంతి గొప్పది
సిరిసిల్లలో ఏ సాహిత్య కార్యక్రమం లో చూసినా డా. చిటికెన కిరణ్ కుమార్(Dr Chitiken Kiran Kumar) కనిపిస్తాడు. అంతేకాదు, నిత్యం ఏదో ఒక వ్యాసం పత్రికల్లో ప్రత్యక్షమౌతుంది. ఇంతకు కిరణ్‌కుమార్ వృత్తి ఏ మాటని వాకబు చేశాను. చేనేత కుటుంబంలో జన్మించి వస్త్ర పరిశ్రమను వృత్తిగా పెట్టుకున్న కిరణ్‌కుమార్‌కు సాహిత్యం అంటే, ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీ య, సమకాలీన అంశాలపై చక్కని చిక్కని వ్యాసాలను ఆంగ్లంలోను, తెలుగులోను వ్రాయడం అంటే వెన్నతో పెట్టిన విద్య.
నిరంతరం సమకాలీన సమాజాన్ని ఆలోచనాలోచనాలతో చూస్తూ, స్పంది స్తూ అదురు బెదురు లేకుండా కవితా రచనలు చేయడం, వ్యాసరచన చేయడం కిరణ్‌కుమార్‌కు నిత్య కృత్యమైంది. ఇంతవరకు కిరణ్‌కుమార్ నూటికిపైగా పత్రిక ల్లో తన వ్యాసాలను ప్రచురించాడు. లోతై న అవగాహనకు, సత్యదృష్టికి అతని వ్యా సాలు ఆలవాలమైనవి. దినపత్రికల్లో, మాస పత్రికల్లో చివరికి అంతర్జాల పత్రికల్లో చిటికెన విస్తృతంగా రచించిన వ్యాసా లు కనిపిస్తాయి.
చిటికెన జీవిత నేపథ్యాన్ని గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆయన తాత చిటికెన నారాయణ చేనేత వృత్తిలో ఉంటూ గీతాశ్రమాన్ని స్థాపించి ఆధ్యాత్మిక, గీతాలు రచించాడు. ఆ గీతాలను విని చిటికెన ప్రేరణ పొందినాడు. చిటికెనకు ఓర్పు, సహనం, సాహిత్య సృజ న, క్రమశిక్షణ అనేవి బాల్యంలోనే అలవడినవి. ప్రముఖ గేయకవి వడ్డేపల్లి కృష్ణ ప్రభావం తనపై ఉందని కిరణ్ చెప్తుంటాడు. రచనానుభవం అనేది కేవలం పుస్త కాలు పఠించడం వల్లనేకాక, సమాజ స్ఫూ ర్తితో జీవితాన్ని అధ్యయనం చేయాలని ఆయన అభిప్రాయపడుతాడు.
ఒక్కోసారి తన వృత్తిని ప్రక్కన పెట్టగలడేమోగాని, నిత్యం రచనా వ్యాసంగాన్ని సా గించడం చిటికెనకు భగవంతుడిచ్చిన వ రం. ఆలోచనా సామర్థ్యం పెంచుకోవడం, నూతన దృక్పధాలను అర్థం చేసుకోవడం, సంక్లిష్ట విషయాలను లోతైన అవగాహన తో విశ్లేషించడం చరిత్రను, సంస్కృతిని ఆ లంబనగా చేసుకోవడం, పైగా వ్యక్తి త్వా న్ని మెరుగుపరుచుకోవడం చిటికెన ప్రత్యేకత.
మన ఆసక్తిని అనుసరించి పుస్తకాలు ఎన్నుకోవాలా? లేక పుస్తకాలను చదివి మన ఆసక్తిని పెంచుకోవాలా అనే విషయంలో కిరణ్ కుమార్ రెండవ అంశానికే ప్రాధాన్యం ఇస్తాడు.
కిరణ్ నవలలు చదువుతాడు. తోటి రచయితలతో పరిచయం పెంచుకుంటా డు. వివిధ సంస్థల కార్యకలాపాల్లో భాగస్వామి అవుతాడు. సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్ట పడే కిరణ్ సాంకేతికతను, ఎప్పటికప్పుడు ఆహ్వానిస్తాడు. కవిత్వాన్ని హృదయ పూర్వకంగా ఆస్వాదిస్తాడు.
చిటికెన అభిప్రాయం ప్రకారం, ఒక రచయిత తాను అంతకుముందు రచించిన పుస్తకాలను మరచిపోకుండా చదువుతూ, కొత్త విషయాలను ప్రెజెంట్ చేయడానికి సన్నద్ధుడు కావాలి. ఏదో రాశాను, ఇప్పు డు ఏదో రాస్తున్నానని కాక, ఏది రాయా లో దాన్ని రాయడానికి తన రచనలను తానే చదివి కొత్తగా సాహి త్య నిర్మాణం చే యాలన్న కిరణ్ తలంపు మెచ్చుకోదగింది.
చిటికెన కిరణ్ కుమార్ కవిగా, రచయితగా, సమీక్షకునిగా, ఐ.బి.ఆర్.ఎఫ్ సభ్యు లుగా తెలుగు సాహితీ ప్రియులకు తె లుసు. బాల్యంలో తాను చేసిన ఏకపాత్రాభినయం అతనిచేత ‘ఓ తండ్రి తీర్పు’ అనే ఒక లఘు చిత్ర రచనకు ప్రేరణ ఇచ్చింది. దాన్ని చిత్రీకరించడం వల్ల దర్శకుడుగా దంశెట్టి ఉమా మహేశ్వరరావుకు ఐ.ఎఫ్. ఎం.ఎ. ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డు లభించింది. దశాబ్దాలుగా తాను చేస్తున్న సాహిత్య కృషికి గాను మాజీ ముఖ్యమంత్రి రోశ య్య, మాజీ గవర్నర్లు విద్యా సాగరరావు, బండారు దత్తాత్రేయ వంటి ప్రము ఖ నాయకులచేత ఎన్నో ప్రశంసా పత్రాలు అందుకున్నాడు.
తొలిసారిగా వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా ఆది లీలా ఫౌండేషన్ (న్యూ ఢిల్లీ), కళా నిలయం (హైదరాబాదు), వే ఫౌండేషన్, ప్రమిలా శక్తిపీఠం మొదలైన సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నారు. ఇం కా ఆయన పొందిన పురస్కారాల్లో ‘గిడుగు రామమూర్తి పంతులు భాషా సేవా పురస్కారం’ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్సలెన్స్ పురస్కారం’ గ్లోబల్ హ్యూమన్ ఎక్సలెన్స్ పురస్కారం (శ్రీలంక దేశ ప్రతినిధులచే) ‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ పురస్కారం’ ‘తెలంగాణ సా హిత్య రత్న పురస్కారం’ మొదలైనవి ఉన్నాయి.
కిరణ్‌కుమార్‌కు రచనా వ్యాసంగం అంటే ఎంత ఇష్టమో ఆయా సదస్సులలో పాల్గొనడమంటే అంతే ఇష్టం. హెచ్ డబ్ల్యూ పీఎల్ దక్షిణ కొరి యా సియోల్ ప్రపంచ శాంతి సంస్థ, క్యూ షు యూనివర్సిటీ జపాన్ వారు ఆన్‌లైన్‌లో నిర్వహిం చిన ప్రపంచ శిఖరాగ్ర శాంతి సదస్సులలో పాల్గొని ప్రశంసా పత్రాలందుకొన్నారు.
పలు సాహితీ సంస్థలలో సభ్యులుగా ఉన్నారు. పలు సంస్థలు నిర్వహించిన సాహిత్య రచనల పోటీలలో న్యాయనిర్ణేతగా ఉన్నారు. సాహిత్య వ్యాసంగాన్ని ఒక బాధ్యతగా భావించి, యజ్ఞదృష్టితో నిర్వహిస్తూ ఎంతోమంది యువ రచయితలకు మార్గదర్శకుడుగా కిరణ్‌కుమార్ ఉన్నాడు.
కిరణ్ కుమార్ సమకాలీన అంశాలపై రాసిన వ్యాసాలు, జాతీయ దినోత్సవాల చారిత్రక నేపథ్యాలు ప్రముఖుల జీవిత చరిత్రలు, సాహిత్య ఫీచర్లు ఆయన సాహిత్యాభిరుచిని తెలియజేస్తాయి. కిరణ్‌కు మార్ పలుకుబడి దేశీయమైంది. సరళత, సూటిదనం, నిబద్ధత, వైవి ధ్యం మొదలైన సద్గుణాల కిరణ్ కుమార్ భాషలో కనిపిస్తాయి. విషయాన్ని ఒక ప్రవాహం లాగా మార్చి పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేయడం, సామాజిక ప్రయోజ నాన్ని సాధించడం ఆయన రచనల ప్రయోజనం.
అధ్యయనం, అనుశీలనం, అవలోకనం ఆ తర్వాత వ్రాయడం అనేవి కిరణ రచనా వ్యక్తిత్వాన్ని మెరుగులు దిద్దా యి. వ్యక్తిగత కీర్తి కోసం కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే రచనలే కిరణ్ కుమార్ కలం నుంచి వెలువడినాయి.
కిరణ్ కుమార్ భావాలు ఉత్తమమైనవి. ఒకదేశం సాధించిన విజయాన్ని, దాని విస్తీర్ణంతోనో, ఆయుధ సం పత్తితోనో, ఆర్థిక పుష్టితోనో కొలువలేం. ఆ దేశంలోని ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల ఆధారంగానే దేశాభ్యున్నతిని లెక్కిం చాలంటాడు. ఏ దేశమైనా తన దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడుకుంటూ ఇతర దేశాలతో స్నేహంగా ఉండాలని, శాంతి కాముకంగా ఉండాలని, అందుకు భారతదేశం ఒక ఉదాహరణ“సంఘర్షణ కంటె శాంతి గొప్పది” అని నమ్మిన రచయిత కిరణ్ కుమార్.
తన వ్యాసాల్లో ప్రాంతీయంగానూ, జాతీయంగాను, అంతర్జాతీయంగాను కనిపించే వర్తమాన కాలపు సమస్యలను ప్రస్తావిస్తూ, వాటికి ఒక మేధావిగా పరిష్కార మార్గాలను చూపించే తెలివి తేటలు కిరణ్ కుమార్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు కాలగమనాన్ని, చారిత్రక నేపథ్యాన్ని, ప్రజల అవసరాలను, దేశాధినేతల కార్యకలాపాలను అర్థం చేసుకునే అలవాటు కిరణ్ కుమార్‌ది. ఒక కాలమిస్టుకు ఉండవలసిన ప్రజ్ఞ, ఒక రచయితకు ఉండవలసిన సామాజిక బాధ్యత కిరణ్ కుమార్‌లో కనిపిస్తాయి.
కిరణ్ కుమార్ వ్యాసాలను చదివినప్పుడు, ఆయనకు గల రాజకీయావగా హన ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఒక చేనేత కు టుంబంలో పుట్టిన వ్యక్తి. ఏ మాత్రం రాజకీయ వాతావరణం చవిచూడని వ్యక్తి ఎట్లా విశ్లేషణ చేస్తున్నాడా అనిపిస్తుంది. బహు శా ఈ రచయిత తన దృష్టిని సమాజంలోని అన్ని రంగాల మీద ప్రసరించడమే అందుకు కారణం అని చెప్పవచ్చు. వెయ్యికిపైగా వ్యాసాలను రచించి ఆయా పత్రికలకు పుష్టిని, పాఠకులకు తుష్టిని కల్గిస్తున్న కిరణ్‌కుమార్ ఒక పుస్తకాన్ని ‘చైతన్యస్ఫూర్తి’ పేరుతో ప్రచురించ డం విశేషం.
వ్యాసకర్త సెల్: 9885654381