అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు
- బీఎస్ఈ, బాంబే హైకోర్టు కూడా టార్గెట్
- ముంబైలో హై అలర్ట్
ముంబై, నవంబర్ 6: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్(Bollywood megastar Amitabh Bachchan) నివాసం ‘జల్సా’ను బాంబులతో పే ల్చేస్తామని బెదిరింపు ఈక్ష వచ్చింది. అంతేకాదు.. బాంబే హైకోర్టు, బాంబే స్టాక్ ఎక్సేంజ్, వర్లీ రేస్ కోర్సులను కూడా పేల్చే స్తామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్స్‌తో భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు. పోలీ సులు, బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ బృందా లు నగరంలో తనిఖీలు చేపట్టాయి.
ముం బైలో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ బె దిరిం పులు నిజమైనవేనా..?ప్రజల్లో భయాం దోళనలు సృష్టించేందుకు పంపిన నకిలీ ఈక్షమెయిల్సా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముంబైలో కీలక ప్రాంతా లకు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి.
బుల్లెట్ ప్రూఫ్ రక్షణలో బిగ్ బీ
బిగ్ బీ ఇంటిని పేల్చివేస్తామంటూ వచ్చిన హెచ్చరికలతో అమితాబ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఆదివారం ముంబైలోని జూహు ప్రాంతంలో ఉన్న తన నివాసం ‘జల్సా’ వెలుపలకు వచ్చి అభిమాను లకు అభివాదం చేయడం అమితాబ్‌కు అలవాటు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులను పలకరించడం దశాబ్దాలుగా ఆయనకు ఆనవాయితీ. అయి తే.. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఈసారి అభిమానులను పలకరించే సమయంలో బిగ్ బీ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
మూడు వైపులా రక్షణ కల్పించేలా పారదర్శక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్ వెనుక నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. ఆ సమయంలో కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా అమితాబ్ పక్కనే నిలబడ్డాడు. బెదిరింపులు వచ్చినా అభిమానులను కలిసే సాంప్రదాయాన్ని కొనసాగించిన బిగ్ బీని అందరూ అభినందించారు.
ఒక వ్యక్తి పనేనా.. ముఠా ఉందా..?
అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపులు కొత్తేమీ కాదు. గతంలో పలు సెషన్స్ కోర్టులకు కూడా బెదిరింపులు వచ్చాయి. అయితే.. ఇటీవల నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన తర్వాత బాంబు బెదిరింపులను సీరియస్‌గా తీసకుంటున్నారు. తాజా బెదిరింపు ఈక్షు వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడా.. లేక ముఠా ఉందా..? గతంలో వచ్చిన బెదిరింపులతో వీటికి సంబంధం ఉందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈసారి దేశ ఆర్థిక కేంద్రం, న్యాయ వ్యవస్థకు చెందిన కీలక ప్రాంతాలు, సినీ రంగ ప్రముఖుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో ముంబైలో భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. బెదిరింపులకు పాల్పడు తున్న వారి ఉద్దేశ్యం ఏమిటి..? అన్న కోణం లోనూ దర్యాప్తు చేస్తున్నారు.