వంటిల్లే వైద్యాలయం!

19-11-2026 | 05:00am

వంటిల్లే ఒక వైద్యశాల. పోపుల పెట్టెలో పసుపు, కారం, ధనియాలు, జిలకర పొడి, బెల్లం, మిరప గింజలు ఇలా ప్రతీది ఏదో ఒక వ్యాధికి మం దుగా పని చేస్తుంది. ఆధునిక కాలంలో చెబుతున్న సన్‌బాత్, బంకమట్టి స్నానం, ఉదయం గోరువెచ్చని నీళ్లు తాగడం.. ఇవన్నీ ప్రకృతితో ముడి పడిన ఆరోగ్య చిట్కాలు. అల్లోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆధునిక పోకడలతో ప్రకృతికి భిన్నంగా జీవన విధానం ఉండడంతో  రోగాలను కొని తెచ్చుకుంటున్నాం.

ప్రకృతితో మమేకమైన జీవితాన్ని గడపాలనే సందేశమే జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవం(National Naturopathy Day). ప్రతి సంవత్స రం నవంబర్ 18న భారత్‌లో జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవం పాటిస్తారు. ప్రకృతి వైద్యం అనేది సహజ మైన జీవన విధానాలకు ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య విధానం. సమతుల్య ఆహారం, స్వచ్ఛ మైన నీరు, తగినంత నిద్ర, యోగా, వ్యాయామం, ధ్యా నం, ప్రకృతితో అను బంధం వంటి అంశాలు ఆరోగ్యకరమైన జీవనానికి దో హదపడతాయి. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ తగ్గ డం వంటి సమస్యల నేపథ్యంలో ప్రకృతి వైద్యంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.

 వ్యాసకర్త : మెడికల్ కాలేజీ లెక్చరర్, 9440408080

ఉమాశేషారావు

మరిన్ని వార్తలు