పోలీసు అమరవీరులకు జోహార్లు
రేపు పోలీసు అమరుల సంస్మరణ దినం :
ప్రజల కోసం జీవిస్తూ, ప్రజల ప్రాణాల భద్రత కోసం పోలీసులు చేస్తున్న త్యాగాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందుకే ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Police Commemoration Day)‘జరుపుకుంటారు.1959 అక్టోబర్ 21న భారత్, చైనా సరిహద్దులో(India-China border) డీఎస్పీ కరమ్‌సింగ్(DSP Karam Singh) నేతృత్వంలో పంజాబ్‌కు చెందిన 21 మంది పోలీసులు, చైనా బలగాలు సియాచిన్ ఆక్రమణకు యత్నిస్తున్న క్రమంలో సి ఆర్పిఎఫ్ దళం హాట్‌స్ప్రింగ్ ప్రాంతంలో వారిని ఎదుర్కొన్నారు.
ఆ పో రాటంలో 1౦మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలకు గుర్తుగా పోలీస్ అమరవీ రుల వారోత్సవాలు జరుపుకుంటు న్నాం. భారత్--చైనా సరిహద్దులోని ఆక్సయ్‌చిన్ ప్రాంతాన్ని హాట్ స్ప్రిం గ్ ప్రాంతం అంటారు. ఈ ప్రాంతం 16 వేల అడుగుల ఎత్తులో, రక్తం గడ్డ కట్టే మంచు పర్వతాల మధ్య ఉం టుంది. దీనిని వేడినీటి బుగ్గ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం అమరవీరుల జవానుల త్యాగాలకు ప్రతీ కగా నిలిచింది.
దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులు బాసిన పోలీ సులను స్మరిస్తూ, యేటా ఈ ప్రాంతాన్ని వివిధ రాష్ట్రాల పోలీసుల బృం దం సందర్శించి నివాళులర్పిస్తారు. దేశాన్ని కాపాడే వారు సైనిక జవాన్లు అయితే, అంతర్గత శక్తుల నుండి ప్రజలను కాపాడేది మన పోలీసులు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే పోలీసుల విధులు భిన్నంగా ఉంటాయి. నిత్యం అప్రమత్తంగా ఉండాలి. పని గంటలలో తేడా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. డ్యూటీకి వచ్చింది మొదలుకొని ఇంటికెళ్లే వరకు విరామం లేకుండా పని చేయాల్సిందే.
కొన్ని సందర్భాల్లో సెలవులు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. పోలీసులలో సిఆర్పిఎఫ్, రిజర్వు, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ట్రాఫిక్ వంటి పోలీస్ వర్గాలు తమ విధి నిర్వహణలో తమ ప్రాణాలు ఫణంగా పెట్టి, ప్రజల ఆస్తులను, దేశ సమగ్రతను, శాంతి భద్రతలను కాపాడుతున్నారు. అందుకే భారత ప్రభుత్వం వారి స్మారకార్థం అమరుల కుటుంబాలకు ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ నిధి ఏర్పాటు చేసింది. ఈ నిధి ద్వారా అమ రులైన కుటుంబాల పిల్లలకు స్కాలర్షిప్లు, ఉచిత విద్య అందిస్తున్నాయి.
ఉచిత వైద్య సదుపాయం అందుతున్నది. ‘ఫ్లాగ్ ఫండ్‘ పేరుతో కేంద్ర రాష్ట్ర ,ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా యేటా నిధిని సేకరిస్తారు. ౧975లో కూడా భారత్, చైనా మధ్య యుద్ధ వాతావరణం ఉండేది. అప్పుడు కూడా పోలీసులు అమరులయ్యారు. ఈ సంవత్సరం జూన్ 15 తూర్పు లడఖ్.. గాల్వాన్ వ్యాలీలో బీహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్ కల్నల్ సంతోష్ బాబుతో కూడిన 20 మంది వీరమరణం చెందడం చరిత్రలో మర్చిపో లేని సంఘటన.
తూర్పు లడఖ్‌లో భారత రహదారి నిర్మాణంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఓసి) వద్ద దొంగదెబ్బ కొట్టి ఉద్రిక్తత దారితీసిన క్రమంలో మన జవాన్లు జరిపిన పోరాటం అజరామం. వారి పోరాట స్ఫూర్తికి జోహార్లు అర్పిద్దాం.ఈ సం వత్సరం పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాల సంస్మరణలో భాగంగా ఈ నెల 21 నుండి 31 వరకు ‘ఫ్లాగ్ డే‘ వేడుకలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఫ్లాగ్ డేలో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా పోలీసు విధులపై అవగాహన కల్పిస్తారు.
రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. రాష్ట్ర భద్ర తలో పోలీసుల పాత్ర, వారి సేవలు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల ద్వారా యువతలో దేశభక్తి, జాతీయభావం, దేశ భద్రతపై అవగాహ న వస్తుంది. పోలీసు అమరుల కుటుంబాలకు మనోధైర్యం క లుగుతుంది. ముఖ్యంగా యువ త, విద్యార్థులు ఈ కార్యక్రమా ల్లో పాల్గొని పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకున్నప్పుడే వారికి నిజమైన నివాళి.
కామిడి సతీశ్ రెడ్డి
వ్యాసకర్త: తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
9848445134