సీఎం పీఠం.. ఎవరి సొత్తు?
భారత రాజకీయాల్లో సామాజిక ప్రాతినిధ్యం.. ఒక విశ్లేషణ
అందరికి విజయదశమి(Vijayadashami) శుభాకాంక్షలు. విజయదశమి అంటే చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయం. ఈ పండుగ సందర్భంగా మ నం సమాజాన్ని ఒక కీలకమైన ప్రశ్న అడగాలి.. స్వాతంత్య్రం(Independence) వచ్చి, రాజ్యాంగం అ మల్లోకి వచ్చి దాదాపు 8 దశాబ్దాలు గడుస్తున్నా, సామాజికంగా వెనుకబడిన వర్గా లకు అత్యున్నత రాజకీయ అధికారంలో (Political Power)సమాన అవకాశాలు లభిస్తున్నాయా? అని!
పాపాయి నవ్వినా, పండగే వచ్చినా పేదల ఇంట్లో కన్నీళ్లే, నిరుపేదల ఇంట్లో కన్నీళ్లే! ‘మనుషులు మారాలి’ (1969) సినిమాలోని ఈ పాట దశాబ్దాలు గడిచినా పేదవాడి జీవితంలో మారని వాస్తవాన్ని హృదయానికి హత్తుకునేలా గుర్తుచేస్తుంది. పండుగ అందరి ఇంటికీ వస్తుంది. కానీ పేదవాడి ఇంట్లో పండుగ వెలుగులు నింపలేకపోతుంది.
ధనవంతుల ఇళ్లలో దీపాలు వెలిగితే, పేదవాడి గుడిసెలో ఆకలి మంటలు ఆరని పరిస్థితి. ఒకవైపు ఆనందాల సందడి, మరోవైపు పూట గడవని కుటుంబాల కన్నీళ్లు! క్యాలెండర్లో పండుగలు మారుతున్నా, పేదవాడి బతుకులో మార్పు ఎక్కడ? పండుగలు మారు తున్నాయి.. ప్రభుత్వాలూ మారుతున్నా యి.. కానీ పేదవాడి బతుకు ఎందుకు మారడం లేదు? పేదవాడికి ధాతృత్వం కాదు.. న్యాయమైన వాటా కావాలి. సంక్షే మం కాదు.. సాధికారత కావాలి. సామాజిక గౌరవం, ఆర్థిక భద్రత, రాజకీయ అధికారం లభించినప్పుడే పేదవాడి ఇంట నిజమైన పండుగ!
రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన ఓటు హక్కు(Right to vote) కల్పించింది. కానీ ఓటులో సమానత్వం ఉన్నంత మాత్రాన అధికారంలోనూ సమానత్వం ఉన్నట్లేనా? ముఖ్య మంత్రి పదవులు, మంత్రి వర్గాలు, విధాన నిర్ణయాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు జనాభా నిష్పత్తికి తగిన ప్రాతినిధ్యం లభిస్తున్నదా? లేక రాజకీయ అధికారం కొన్ని సామాజికవర్గాలకే పరిమితమవుతున్నదా?
ముఖ్యమంత్రి పదవి కేవలం ఒక హోదా కాదు.. రాష్ట్ర ప్రాధాన్యతలను, బడ్జె ట్ కేటాయింపులను, అభివృద్ధి విధానాలను ప్రభావితం చేసే నిర్ణయాధికారం. అణగారిన వర్గాల ఆత్మగౌరవ చిహ్నం. అందువల్ల రాజకీయ అధికారంలో సామాజిక ప్రాతినిధ్యాన్ని పరిశీలించడం సామా జిక న్యాయానికి కీలకమైన ప్రమాణం. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు కాదు.. అధికారంలో భాగస్వామ్యం, నిర్ణయాధికారంలో వాటా, వనరుల్లో వాటా, సమాన అవకాశాలు కూడా. రాజకీయ ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యం గా మారినప్పుడే రాజ్యాంగ ఆశయాలు సార్థకమవుతాయి.
పట్టిక ఏమి సూచిస్తోంది?
1. అగ్రకులాల రాజకీయ ఆధిపత్యం- దేశంలోని 28 రాష్ట్రాల్లో, 8 ఈశాన్య రాష్ట్రా లు తీసివేయగా, మిగిలిన 20 రాష్ట్రాలలో 14 రాష్ట్రాలకు ఆధిపత్య కులాలు/ ఓసీలు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. కేవ లం మూడు రాష్ట్రాల్లో ఓబీసీలు మరో 3 రాష్ట్రాలలో ఎస్టీలు సీఎంలుగా ఉన్నారు. ఎస్సీలు 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా సీఎంగా లేరు. అంటే మెజారిటీ రాష్ట్రాలు అభివృద్ధి చెందిన కులాల చేతి లో ఉన్నాయి. ఈ దేశంలో సమానత్వం, సమాన అవకాశాలు, సామజిక న్యాయం ఒక డొల్ల అని తేలిపోయింది.
బహుజనులకు రాజ్యాధికారం అందని ద్రాక్ష పండు గానే మిగిలిపోయింది. మొత్తం దేశంలో ఎస్టీలు 8 రాష్ట్రాలలో సీఎంలుగా పనిచేస్తున్నారు. అందులో 5 ఈశాన్య రాష్ట్రాలే. మహిళలు కూడా ఏ రాష్ట్రంలో సీఎంగా లేరు. ఢిల్లీ కేంద్ర పాలిత రాష్ట్రంలో ఒక మహిళా సీఎంగా ఉన్నారు. మరి 80 ఏళ్ల స్వాతంత్రంలో సామాజిక మార్పు ఎంతవరకు జరిగింది? పాలనలో అణ గారిన వర్గాలకు ఎలాంటి స్థానం లభించింది అనే విషయానికి ఈ గణాంకాలే సాక్ష్యం.
2. బీజేపీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందులో మూడింట్లో ఓబీసీలను ముఖ్యమంత్రులుగా నియమించారు. రెండింట్లో ఎస్టీలను నియమించారు. ఎస్సీలకు ఒక్క అవకాశం ఇవ్వలేదు. ఆంధ్రప్ర దేశ్‌లో కూటమి ప్రభుత్వం.. అక్కడ కూడా ఒక ఓసీనే ముఖ్య మంత్రి. భారతీయ జనతా పార్టీ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని మాట్లాడుతోంది. గతంలో దళిత నాయకుడు బంగారు లక్షణ్‌ను పార్టీ జాతీ య అధ్యక్షుడిగా నియమించింది. రామ్‌నాథ్ కోవింద్‌ను( దళిత), ఆదివాసీ మహి ళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసింది.
ఐతే దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి దళితుడిని, ఆదివాసీ మహిళను ఎంపిక చేయ గలిగిన పార్టీ, 1980లో ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు ఒక్క ఎస్సీ నాయ కుడిని కూడా ఏ రాష్ట్రంలోనూ సీఎంగా ఎందుకు చేయలేకపోయింది? దీనిపై సీరియస్‌గా ఆలోచించాలి. ఆ లోటును కూడా పూర్తి చేయాలి. అలాగే కాంగ్రెస్ పాలిత నాలుగు రాష్ట్రాల్లో నలుగురు కూడా అగ్రవర్ణాల వాళ్లే ఉన్నారు. సామాజిక న్యా యం మా పేటెంట్ అని చెప్పుకునే కాంగ్రె స్ తాము పాలిస్తున్న నాలుగు రాష్ట్రాల్లో ఒక్క ముఖ్యమంత్రిని కూడా మహిళ/ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఇవ్వలేదు. ఇది వీరి ద్వంద్వ నీతికి నిదర్శనం.
3. ఎస్సీ (దళితులకు) ముఖ్యమంత్రి పదవి ఎందుకు దక్కడం లేదు? గతంలో దామోదరం సంజీవయ్య భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి.. 1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 12 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశారు. మాయావతి.. దేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమం త్రి. నాలుగుసార్లు ఉత్తరప్రదేశ్ సీఎం గా పనిచేశారు. 2007 నుంచి 2012 వరకు పూర్తి ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేశారు. బిహార్.. భోలా పాస్వాన్ శాస్త్రి, రామ్ సుం దర్ దాస్, జీతన్ రామ్ మాంఝీ ముగ్గు రు దళిత నాయకులు ముఖ్యమంత్రులయ్యారు. పంజాబ్‌లో తొలి దళిత ముఖ్య మంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ. రాజస్థాన్‌లో తొలి దళిత ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా. మహారాష్ట్రలో సుశీల్‌కుమార్ షిండే తొలి దళిత ముఖ్యమంత్రి.. వీరంతా సమర్ధవంతంగా పనిచేసిన నాయకులే. మరి ముఖ్యమంత్రి పదవి ఎందుకు దక్క డం లేదు. దీనిని మూడు కోణాల్లో పరిశీలించాలి.
ఎ) సామాజిక వివక్షత: ఇంకా భారత్‌లో కుల వివక్ష పోలేదు. సమానత్వం రాలేదు. ఆధిపత్య భావజాలం కొనసాగుతూనే ఉంది. అంటరానితనం, భూమి, విద్య, ఆర్థిక వనరులలో అసమానతలు దళితుల రాజకీయ ఎదుగుదలను చారిత్రకంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
బి) పార్టీల నాయకత్వ నిర్మాణం: అన్ని కూడా ఆధిపత్య కుల, మనువాద, వారసత్వ పార్టీలు. ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొనే పార్టీలు. బీఎస్పీ.. బహుజనుల పార్టీ కాబట్టి మా యావతి సొంత బలంతో ముఖ్యమంత్రి కాగలిగారు. రాజకీయ పార్టీలలో టికెట్ల పంపిణీ, సీఎం అభ్యర్థి ఎంపిక, పార్టీ నిధు లు, నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉన్నాయన్నది కీలకం.
సి) ప్రాతినిధ్యం వర్సెస్ నిర్ణయాధికా రం: దళితులు ఎమ్మెల్యేలుగా లేదా మం త్రులుగా ఎన్నికవడం ఒక విషయం. ముఖ్యమంత్రి వంటి అత్యున్నత నిర్ణయాధికార స్థానానికి చేరుకోవడం మరో విష యం. భారత రాజ్యాంగంలోని 330, 332 అధికరణాలు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ/ఎస్టీలకు జనాభా నిష్పత్తికి దగ్గ రగా సీట్ల రిజర్వేషన్ కల్పిస్తాయి. కానీ ముఖ్యమంత్రి పదవికి కులాలవారీగా రిజర్వేషన్ లేదు. ఆధిపత్య కులాలు తమ రాజ కీయ ఆధిపత్యాన్ని బహుజనులతో పం చుకోవడానికి ఇష్ట పడటం లేదు. చాల పార్టీలు వారసత్వ పార్టీలే. ‘మను భావజాలంతో ఉన్నవే. బహుజన పార్టీలు అధికా రంలోకి వస్తే తప్ప దీనికి విముక్తి లేదు.
4. ఓబీసీల జనాభా ఎక్కువైనా ముఖ్యమంత్రి పదవులు ఎందుకు తక్కువ? ఓబీ సీలు దేశంలో విస్తృతమైన సామాజికవర్గం. (52శాతం) అయినప్పటికీ, వారి జనాభాకు రాజకీయ నాయకత్వంలో వారి వాటాకు పోలికే లేదు. ఇక్కడ మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
v ఓబీసీలు ఒకే రాజకీయ సమూహం కాదు. వందలాది కులాలు, ఉపకులాలు, ప్రాంతీయ సమూహాలు ఇందులో ఉన్నా యి. కొన్ని కులాలు ఆర్థికంగా, రాజకీయం గా బలంగా ఎదిగాయి. మరికొన్ని ఇంకా వెనుకబడి ఉన్నాయి.
v జనాభా బలం అధికారంగా మారాలంటే సంఘటిత బలం అవసరం. ఓటర్ల సంఖ్యతోపాటు నాయకత్వం, ఎన్నికల టికెట్లు, ఆర్థిక వనరులు, రాజకీయ కూటములు కీలకం.
5. ఎస్టీలకు సీఎం పదవులు లభిస్తున్న తీరు ఎలా చూడాలి? జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఐదు ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన నేపథ్యం కలిగిన ముఖ్యమంత్రులు ఉండ టం గమనించదగిన విషయం. అయితే, దీన్ని దేశవ్యాప్తంగా ఎస్టీలకు సమానమైన రాజకీయ సాధికారత లభించిందని భావించకూడదు. గిరిజన జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో వారి నాయకత్వానికి ఉన్న అవకాశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలు వేర్వేరుగా ఉంటాయి. ఇక్కడ రెండు ప్రశ్నలు అవసరం..
v గిరిజన జనాభా నిష్పత్తికి అనుగుణంగా ముఖ్యమంత్రి, మంత్రివర్గం, శాసన సభల్లో ప్రాతినిధ్యం ఉందా?
v గిరిజన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలోనే అన్ని గిరిజన తెగలకు విద్య, భూమి, అటవీ హక్కులు, ఉపాధి, రాజకీయ నిర్ణయాధికారంలో న్యాయం జరుగుతోందా? సీఎం సామాజిక నేపథ్యం, ప్రభుత్వ విధానాల ఫలితాలు రెండింటినీ వేర్వేరుగా కొలవాలి.
6. సామాజిక న్యాయాన్ని ఎలా కొలవాలి?
జనరల్ కేటగిరీకి చెందిన వ్యక్తులు ముఖ్యమంత్రులు కావడాన్ని వ్యతిరేకించడం సామాజిక న్యాయం కాదు. చారిత్ర కంగా వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయా, రాజకీయ అధికా రంలో అసమానతలకు కారణాలేమిటి అన్నది ప్రశ్నించడం నిజమైన సామాజిక న్యాయం.
దీనిని మూడు ప్రమాణాలతో అంచనా వేయాలి..
1.జనాభా న్యాయం: జనాభా నిష్పత్తితో పోలిస్తే రాజకీయ ప్రాతినిధ్యం ఎంత?
2.అధికార న్యాయం: ముఖ్యమం త్రి పదవులు, మంత్రివర్గాలు, పార్టీ నాయకత్వం, కీలక శాఖల్లో ఎవరి భాగస్వామ్యం ఎంత?
3.ఫలితాల న్యాయం: విద్య, ఉపా ధి, భూమి, బడ్జెట్ కేటాయింపులు, సామాజిక భద్రతలో వెనుకబడిన వర్గాలకు ఎంత ప్రయోజనం అందుతోంది?
7. మార్పు కోసం కార్యాచరణ- సామాజిక న్యాయం ఆచరణలోకి రావాలంటే కొన్ని చర్యలు అవసరం: ‘మనువాద భావజాల వైఖరుల్లో మార్పునకు కృషి, సమా నత్వ సాధన కోసం కృషి.
‘జనగణనలో కులగణన ద్వారా విశ్వసనీయమైన సామాజిక గణాంకాలు సేకరిం చడం. ‘రాజకీయ పార్టీ ల అభ్యర్థుల ఎం పిక, మంత్రిపదవులు, నాయకత్వ స్థానా ల్లో సామా జిక ప్రాతినిధ్యంపై పారదర్శక నివేదికలు రూపొందించడం. ‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు నాయకత్వ శిక్షణ, రాజకీయ అవకాశాలు కల్పించడం, బహుజన రాజకీయ పార్టీలు అధికారాన్ని చేపట్టడం..
‘అత్యంత వెనుకబడిన కులాలు, సంచా ర జాతులు, వృత్తి సమూహాల ప్రాతినిధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం. ‘పార్టీల అం తర్గత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, నాయకత్వ ఎంపికలో సామాజిక వైవిధ్యా న్ని పెంచ డం. ముఖ్యమంత్రి పదవికి కులాలవారీ రిజర్వేషన్ ప్రస్తుతం రాజ్యాంగం లో లేదు. కాబట్టి చట్టపరమైన మార్పులపై చ ర్చతో పాటు, రాజకీయ పార్టీలు తక్షణమే అమలు చేయ గల సంస్కరణలపైనా దృష్టి పెట్టాలి.
8. హిస్సా ఇజ్జత్ హుకుమత్.. సామాజిక న్యాయానికి మూడు పునాదులు ఉన్నాయి.
హిస్సా (వాటా): జనాభాకు తగిన ప్రా తినిధ్యం, వనరుల్లో న్యాయమైన వాటా.
ఇజ్జత్ (ఆత్మగౌరవం): కుల వివక్ష లేని సమాజం, సమాన గౌరవం, సమాన అవకాశాలు.
హుకుమత్ (అధికారం): రాజకీయ నిర్ణయాలు తీసుకునే సంస్థల్లో అర్థవంతమైన భాగస్వామ్యం.
ఈ లక్ష్యాలు ముఖ్యమంత్రి పదవికే పరిమితం కాకుండా, శాసనస భలు, మంత్రివర్గాలు, రాజకీయ పార్టీ లు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ పరిపాలన వరకు విస్తరించాలి. ఓటు హక్కులో సమానత్వం ఉన్నప్పుడే సరిపోదు, రాజకీయ అధికారంలోనూ సమాన వాటా లభించాలి. బహుజనులకు సముచిత ప్రాతినిధ్యం దక్కిన ప్పుడే ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యంగా వికసిస్తుంది. ఈ విజయదశమి సందర్భంగా మన సం కల్పం ఒక్కటేప్రతి సామాజిక వర్గానికి గౌరవం, సముచిత ప్రాతినిధ్యం, స మాన రాజకీయ అవకాశాలు కల్పించడం. అందుకు సంఘటితమై, ఓటు చైతన్యంతో ఎన్నికల్లో ఐక్యంగా పోరా డి, రాజకీయాధికారాన్ని సాధిద్దాం. అప్పుడే నిజమైన విజయదశమి!
టీ. చిరంజీవులు
విశ్రాంత ఐఏఎస్,
బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మన్