బీసీ హామీల అమలెక్కడ?

14-11-2026 | 05:10am

గౌరవనీయులైన శ్రీరాహుల్‌గాంధీ గారికి, 

లోక్‌సభలో ప్రతిపక్ష నేత,

భారత జాతీయ కాంగ్రెస్, న్యూఢిల్లీ.

విషయం: తెలంగాణ బీసీ(Telangana BC)లకు 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు --కులగణన, 42 శాతం రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం పై మీ వైఖరిని స్పష్టం చేయాలని విజ్ఞప్తి.

నమస్కారం,

హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ -- ఫ్యూచర్ సిటీ సదస్సుకు విచ్చేస్తున్న మీకు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం, ఇతర బీసీ సంఘాల తరఫున హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఢిల్లీకి తిరిగి వెళ్లే ముందు, 2023 ఎన్నికల సందర్భంగా తెలంగాణ బీసీ సమాజానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం. బీసీ మేధావులు, విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, సామాజిక సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక మీడి యా సమావేశం ఏర్పాటు చేసి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తు న్నాం. ౫అంశాలను ముందుంచుతున్నాం.

1. 42 శాతం రిజర్వేషన్లు - కేంద్రంపై ఒత్తిడి ఏదీ?

మీ చొరవతో తెలంగాణలో 2024లో సమగ్ర కులగణన నిర్వహించి, గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. వాటి ఆధా రంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి, 2025 ఏప్రిల్‌లో కేంద్రానికి పంపించింది. అయినప్పటికీ, ఆ బిల్లులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి.

మా ప్రశ్నలు:

1. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఎన్నికల హామీ అమలుకు కేంద్రం పై ఎన్నిసార్లు ఒత్తిడి తీసుకొచ్చారు?

2. ఈ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారా? పార్లమెంటులో ఎన్నిసార్లు ప్రస్తావించారు?

3. ఇతర జాతీయ అంశాలపై పోరాడుతున్న మీరు, బీసీ రిజర్వేషన్లపై అదే స్థాయిలో ఎందుకు పోరాడటం లేదు? 

4. తెలంగాణ అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎందుకు కోరడంలేదు?

5. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని అధిగమిస్తామని చెబుతున్న మీరు, తెలంగాణ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారా?

2. కులగణనలో ప్రత్యేక కాలమ్, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఉండొద్దా?

2027 జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కులాల పేర్లలో ప్రాంతీయ భేదా లు, అక్షర దోషాలు, ఉపకులాలు, పర్యాయపదాల వల్ల గణాంకాల్లో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది. 2011 సామాజిక, ఆర్థిక, కులగణనలో ఎదురైన సమస్య లు పునరావతం కాకుండా శాస్త్రీయమైన విధానాన్ని రూపొందించాలి.

మా ప్రశ్నలు:

1. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా జనాభా లెక్కల్లో ప్రత్యేక కుల కాల మ్ ఎందుకు ఉండకూడదు?

2. ప్రతి బీసీ కులానికి ప్రత్యేక గుర్తింపు కోడ్ ఎందుకు కేటాయించకూడదు?

3. గుర్తించిన కులాల జాబితాతో డ్రాప్‌డౌన్ మెనూను ఎందుకు ప్రవేశ పెట్టొద్దు?

4. అన్ని గుర్తింపు పొందిన బీసీ కులాలకు ప్రత్యేక కోడ్లు కేటాయించాలని కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదు?

5. శాస్త్రీయమైన, సమగ్రమైన కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి లో ఎందుకు ఉద్యమించడం లేదు?

మా నినాదం : ‘కులగణనలో ప్రతి కులానికి గుర్తింపు ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ -- జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్కరికీ వాటా!’.

3. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ --21 హామీల అమలు ఏమైంది?

2023 నవంబర్ 10న కామారెడ్డిలో అప్పటి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారి సమక్షంలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించి, బీసీల అభివృద్ధికి 21 హామీలు ఇచ్చింది. ముఖ్యంగా ఏటా రూ.20 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీ ఏమైంది? 

మా వద్ద ఉన్న బడ్జెట్ గణాంకాల ప్రకారం:

2024 2025- ఆర్థిక సంవత్సరాల్లో కలిపి బీసీలకు సుమారు రూ.20,605 కోట్లు, 2026 బడ్జెట్‌లో రూ.12,200 కోట్లు కేటాయించారు. మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.60,000 కోట్లు కేటాయించాల్సి ఉం డగా, ఇప్పటివరకు సుమారు రూ.33,116 కోట్లకే పరిమితమయ్యాయి.గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వాస్తవ ఖర్చు కేవలం రూ.5,143 కోట్లు మాత్రమేనని గణాంకాలు సూచిస్తున్నాయి.

మా ప్రశ్నలు:

1. ఐదేళ్లలో రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్న హామీ ఏమైంది?

2. మొదటి మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.60,000 కోట్లు కేటాయించా ల్సి ఉండగా, ఎందుకు పూర్తి స్థాయిలో కేటాయించలేదు?

3. కేటాయించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో ఎందుకు ఖర్చు చేయడం లేదు?

4. ఇతర శాఖల నిధులను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, బీసీ సంక్షేమ నిధులను ఎందుకు ఖర్చు చేయలేకపోతోంది?

5. మిగిలిన 20 హామీల అమలుకు మీ కార్యాచరణ ప్రణాళిక ఏమిటి?

మాకు ఇతర వర్గాల హామీలతో సంబంధం లేదు. మా ప్రధాన డిమాండ్ ఒక్కటే: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లోని మొత్తం 21 హామీలను సంపూర్ణంగా అమ లు చేయాలి. బీసీల మద్దతుతో అధికారంలోకి వచ్చి, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం బీసీ సమాజానికి తీవ్ర నిరాశ కలిగించే విషయం కాదా?

4. సామాజిక న్యాయం --మాటల్లోనా? చేతల్లోనా?

మీరు దేశవ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు, సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నారు. మరి మీ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో అది ఎం తవరకు అమలవుతోంది? ప్రస్తుతం 16 మంది మంత్రులున్న రాష్ట్ర మంత్రి వర్గం లో కేవలం ఇద్దరే బీసీలు.మరో నాలుగు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.

మా విజ్ఞప్తులు:

1. ఖాళీగా ఉన్న నాలుగు మంత్రి పదవులను బీసీ నాయకులతో భర్తీ చేయాలి.

2. జనాభా ప్రాతిపదికన బీసీలకు రాష్ట్ర మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.

3. శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో, ముఖ్యంగా గవర్నర్ కోటా కింద భర్తీ చేయాల్సిన స్థానా ల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.

జనాభాలో అధిక వాటా కలిగిన బీసీలకు పాలనలోనూ, అధికారంలోనూ తగి న భాగస్వామ్యం కల్పించడమే నిజమైన సామాజిక న్యాయం.

5. రాజకీయ న్యాయం, నియామకాల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం ఎక్కడ?

సామాజిక న్యాయం విద్య, ఉద్యోగాలకే పరిమితం కాకుండా కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు, ఇతర రాజకీయ నియామకాల్లోనూ ప్రతిబింబించాలి. అయితే, కొన్ని సామాజిక వర్గాలకే అధిక ప్రాధాన్యత లభిస్తుండగా, మిగిలిన బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీల కు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదు. బీసీల్లోని సుమారు 130 కులాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత లేదా?

మా ప్రశ్నలు:

1. కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారా?

2. ఎమ్మెల్సీ, నామినేటెడ్, ఇతర రాజకీయ పదవుల భర్తీలో సామాజిక న్యాయం పాటిస్తున్నారా?

3. రాజకీయంగా వెనుకబడిన బీసీ కులాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

4. తెలంగాణలో మీ పార్టీ అనుసరిస్తున్న రాజకీయ నియామకాల విధానాన్ని ఎప్పుడైనా సమీక్షించారా?

5. సామాజిక న్యాయం ప్రసంగాలకే పరిమితమా? లేక రాజకీయ అధికార పం పిణీలోనూ అమలవుతోందా? హైదరాబాద్ నుంచి సామాజిక న్యాయంపై స్పష్ట మైన సందేశం ఇవ్వండి!

తెలంగాణ బీసీ సమాజం తరఫున మా విజ్ఞప్తులు:

1. హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లే ముందు బీసీ మేధావులు, విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, సామాజిక, ప్రజాసంఘాల ప్రతినిధులతో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయాలి.

2. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై తీసుకున్న చర్యలను వెల్ల డించాలి.

3. దేశవ్యాప్త సమగ్ర, శాస్త్రీయ కులగణనకు స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి.

4. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లోని 21 హామీల అమలుకు నిర్దిష్ట కాలపట్టిక ప్రకటించాలి.

5. మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.

మా ప్రధాన డిమాండ్ : అధికారంలో వాటా, --అభివృద్ధిలో వాటా, విద్య, ఉద్యోగ అవకాశాల్లో వాటా, రాజకీయ ప్రాతినిధ్యంలో వాటా..

బీసీ సమాజం కోరుతున్నది కొత్త హామీలు కాదు, గతంలో ఇచ్చిన హామీల అమలే. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపించేందుకు రాజకీయ సంకల్పం, స్పష్టమైన కార్యాచరణ, నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించాలని కోరుతున్నాం. సామాజిక న్యాయం ప్రసంగాల్లో కాదు -.. పాలనలో, బడ్జెట్‌లో, అధికార పంపిణీలో, రాజకీయ ప్రాతినిధ్యంలో ప్రతిబింబించాలి.

విశ్రాంత ఐఏఎస్, బీసీ 

ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్

టీ చిరంజీవులు

మరిన్ని వార్తలు