బాలల హక్కులకు భరోసా ఏదీ?

19-11-2026 | 05:05am

నవంబర్ 20.. క్యాలెండర్‌లో ఒక తేదీ కాదు. అది ప్రపంచ బాలల దినోత్సవం(World Children's Day). 1950లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. సరిగా 30ఏళ్ల తరువాత 1989లో నవంబర్ 20న బాలల హక్కుల ఒప్పందాన్ని ఆమోదించిది. భూమ్మీద ఉన్న ప్రతి బిడ్డ కు ఇచ్చిన మాట, ప్రతి బిడ్డకు బతికే హక్కు, చదువుకునే హక్కు, ఆడుకునే హక్కు, సురక్షితంగా ఉండే హక్కు.. భారత రాజ్యాంగం బాలలకు కల్పించిన హక్కులు బాలలందరికి అందుతున్నాయా అనేది ప్రశ్న. దేశంలో బడి మానేసిన పిల్లలు సంఖ్య చాలా తగ్గింది. ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్ 8.7శాతం నుంచి 2.3శాతానికి తగ్గింది. సెకండరీ స్థాయిలో 13.8శాతం నుంచి 8.2శాతానికి తగ్గింది. ఇక బాలకార్మికులు 2011జనాభా లెక్కలో 3.3 లక్షలు మంది ఉంటే సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం 80శాతం తగ్గింది.

ఈ ఏడాది ఆపరేషన్ స్మైల్ ద్వారా 5,583 మంది పిల్లలను కార్మిక వ్యవస్థ నుంచి రక్షించారు. ఇవి కేవలం అంకెలు కాదు.. అక్షరాల నిజం. ఇంకా చేదు విష యం గర్భస్థ పిండం ఆడపిల్ల అని నిర్ధారణ పరీక్షల్లో తెలియగానే భ్రూణ హత్యలు కొనసాగుతున్నాయి. యునిసెఫ్ 2005 నివేదిక ప్రకారం 20.6 కోట్ల మంది పిల్లలు విద్య, ఆరోగ్యం, పోషకాహారం, మంచినీరు వసతుల్లో కనీసం ఒక్కదానికైనా దూరంగా ఉన్నారు. 6.2 కోట్ల మంది పిల్లలు రెండు లేదా అంతకంటే ఎక్కువ సేవలకు దూరంగా ఉన్నారు. పోషకాహార లోపం అతిపెద్ద అవమా నం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2026 లో భారత్ 122 దేశాల్లో 100 స్థానం లో ఉంది. బాలల హక్కుల కోసం ప్రభు త్వం ఎన్నో చట్టాలను చేసింది. కానీ, అమలుపై దృష్టి పెట్టడం లేదు. నవంబర్ 20 బాలల హక్కుల దినోత్సవం జరుపుకోవడం కాదు, వారికి ఆ ఫలాలు అందించినప్పుడే ఆత్మవిశ్వాసం, భరోసా ఏర్పడతాయి.

వ్యాసకర్త సెల్: 9000010717 

సయ్యద్ షఫీ

మరిన్ని వార్తలు