ఇసుక అక్రమ రవాణా.. కలెక్టర్ కు ఫిర్యాదు

03-11-2026 | 11:48am

కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కొడిమ్యాల మండల పరిసర ప్రాంతాల నుండి మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా, ఇసుక అధిక రేట్లను అరికట్టాలని, ఇసుక రవాణా మాఫియా పై చర్య తీసుకోవాలని సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్  ప్రజావాణి కార్యక్రమంలో కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన వోడ్నాల సాగర్ బిఆర్ఎస్ నాయకుడు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్(Collector Satyaprasad)కు 4 పత్రాల పూర్తి ఆధారాలతో కూడిన ఫిర్యాదును సమర్పించడం జరిగింది. స్పందించిన కలెక్టర్ సంబంధిత మైనింగ్  అధికారులకు అక్రమ ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, అక్రమ ఇసుక రవాణా చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు